Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: కామెరూన్ గ్రీన్ కళ్లు చెదిరే క్యాచ్.. నోరెళ్ల బెట్టిన రహానే(వీడియో)

లండన్: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌ రౌండర్ కామెరూన్ గ్రీన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సెన్సేషనల్ క్యాచ్‌తో మైమరిపించాడు. గ్రీన్ సూపర్ క్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

మూడు రోజు రెండో సెషన్‌లో ప్యాట్ కమిన్స్ వేసిన 62వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని కమిన్స్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. రహానే పంచ్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్‌కు దూరంగా దూసుకెళ్లింది. ఇక గ్రీన్ సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు రహానే బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Cameron Green Catch

రహానే వికెట్‌తో ఉమేశ్ యాదవ్ క్రీజులోకి రాగా అతన్ని కమిన్స్ ఔట్ చేశాడు. అనంతరం మహమ్మద్ షమీ బ్యాటింగ్‌కు రాగా.. శార్దూల్ ఠాకూర్ సూపర్ బ్యాటింగ్‌తో 108 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. షమీని స్టార్క్ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ 296 పరుగులకు ముగిసింది. రహానే వికెట్ అనంతరం 35 పరుగుల్లోనే భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఆస్ట్రేలియాకు 173 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.

భారత బౌలర్లలో సిరాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.

Story first published: Friday, June 9, 2023, 18:47 [IST]
Other articles published on Jun 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+