Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఏకైక జట్టుగా..!

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. భారత్‌తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో తొలిసారి టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఆసీస్.. అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే అన్నీ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది.

ఇప్పటికే ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలను, ఒక టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తాజాగా డబ్ల్యూటీసీ ట్రోఫీ కూడా గెలిచి మొత్తం 9 ఐసీసీ టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఆసీస్ నిలిచింది.

WTC Final 2023: Australia script history, first team to win all ICC Trophies

ప్యాట్ కమిన్స్ టెస్ట్ కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత ఆసీస్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో యాషెస్ సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకున్న ఆసీస్.. టెస్ట్‌ల్లో నెంబర్ వన్ టీమ్‌గా నిలిచింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంతో పాటు పాకిస్థాన్‌ను సొంతగడ్డపై ఓడించింది.

నెంబర్ ట్రోఫీ ప్రత్యర్థి సంవత్సరం కెప్టెన్
1 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్ 1987 అలన్ బోర్డర్
2 వన్డే ప్రపంచకప్ పాకిస్థాన్ 1999 స్టీవ్ వా
3 వన్డే ప్రపంచకప్ భారత్ 2003 రికీ పాంటింగ్
4 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ 2006 రికీ పాంటింగ్
5 వన్డే ప్రపంచకప్ శ్రీలంక 2007 రికీ పాంటింగ్
6 ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ 2009 రికీ పాంటింగ్
7 వన్డే ప్రపంచకప్ న్యూజిలాండ్ 2015 మైకేల్ క్లార్క్
8 టీ20 ప్రపంచకప్ న్యూజిలాండ్ 2021 ఆరోన్ ఫించ్
9 డబ్ల్యూటీసీ భారత్ 2023 ప్యాట్ కమిన్స్

మరోవైపు భారత్ మాత్రం గత తొమ్మిది ఐసీసీ టోర్నీల్లో ఓటమిపాలైంది. ఇందులో నాలుగు సార్లు ఫైనల్లో ఓడిన భారత్.. మరో నాలుగు సార్లు సెమీఫైనల్లో వెనుదిరిగింది. ఒక్కసారే లీగ్ దశలో ఇంటిదారిపట్టింది.

444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, June 11, 2023, 19:57 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+