Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023 గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.!

లండన్: ప్రతిష్టాత్మక వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం నుంచి భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఆసీస్ తమ సహాయక బృందంలోకి ఇంగ్లండ్ మాజీ హెడ్ కోచ్, జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్‌ను తీసుకుంది.

ఈ మెగా ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ పూర్తయ్యే వరకు అతను బ్యాక్‌రూమ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తాడని పేర్కొంది. ఇంగ్లండ్ టీమ్ హెడ్ కోచ్‌గా.. అక్కడి పరిస్థితుల పట్ల ఆండీ ఫ్లవర్‌కు అపారమైన అనుభవం ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది.

 WTC Final 2023

2009 నుంచి 2014 వరకు ఆండీ ఫ్లవర్.. ఇంగ్లండ్ టీమ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. అంతకుముందు ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. అతను హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు ఇంగ్లండ్ మూడు సార్లు యాషెస్ సిరీస్ గెలిచింది. ఇక ఆండీ ఫ్లవర్.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ వేదికగానే యాషెస్ సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా పకడ్బందీగా సిద్దమవుతోంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా గంటలకొద్దీ స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు.

ఐపీఎల్ 2023 సీజన్ మత్తులో ఉన్న భారత ఆటగాళ్లు అంత త్వరగా టెస్ట్ ఫార్మాట్‌ను అందిపుచ్చుకోలేరని భావించిన ఆసీస్ ఆ దిశగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. స్వింగ్ కండిషన్స్‌లో భారత బ్యాటర్లు తడబడుతారని గ్రహించిన ఆ జట్టు.. స్లిప్ క్యాచ్‌లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఈ మెగా ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ గాయంతో స్వదేశం పయనమయ్యాడు. అతని స్థానంలో స్కాట్ బోలాండ్ ఆడే అవకాశం ఉంది. ఇక ఆసీస్ ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ కాంబినేషన్‌తో ఆసీస్ బరిలోకి దిగనుంది.

Story first published: Monday, June 5, 2023, 21:59 [IST]
Other articles published on Jun 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+