Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: టీమిండియా బలహీనతే లక్ష్యంగా ఆసీస్ ప్రాక్టీస్.. ఐపీఎల్ హ్యాంగోవరే టార్గెట్‌గా భారీ ప్లాన్!

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా పకడ్బందీగా సిద్దమవుతోంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఫైనల్లో భారత్‌తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే లండన్ చేరుకున్న ఆసీస్.. అక్కడి పరిస్థితులను అందిపుచ్చుకోవడంతో పాటు భారత్ బలహీనతలే లక్ష్యంగా ముమ్మర సాధన చేస్తోంది.

సోమవారం ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా గంటలకొద్దీ స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. ఐపీఎల్ 2023 సీజన్ మత్తులో ఉన్న భారత ఆటగాళ్లు అంత త్వరగా టెస్ట్ ఫార్మాట్‌ను అందిపుచ్చుకోలేరని భావించిన ఆసీస్ ఆ దిశగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. స్వింగ్ కండిషన్స్‌లో భారత బ్యాటర్లు తడబడుతారని గ్రహించిన ఆ జట్టు.. స్లిప్ క్యాచ్‌లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

 WTC Final 2023

అలాగే ఔట్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు ఇబ్బంది పడే విరాట్ కోహ్లీని అదే వ్యూహాంతో దెబ్బతీయాలనుకుంటోంది. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను కూడా స్వింగ్ బాల్స్‌తో దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టులో ఉన్న ప్రతీ బ్యాటర్‌కు పకడ్బందీ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే స్లిప్ క్యాచ్‌లను కీలకమని భావించిన ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్.. స్లిప్ క్యాచ్‌లకు స్పెషల్ సెషన్‌ నిర్వహించింది.

ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతుంటాడు. వాటిని అనవసరంగా ఆడుతూ స్లిప్ లేదా కీపర్ క్యాచ్‌గా చాలా సార్లు ఔటయ్యాడు. మరోసారి అదే వ్యూహంతో కోహ్లీని దెబ్బతీయాలని ఆసీస్ భావిస్తోంది. అంతేకాకుండా ఐపీఎల్ 2023 సీజన్‌లో దూకుడుగా ఆడి జోరు మీదున్న భారత బ్యాటర్లను అదే జోరులో ఔట్ చేయాలని వ్యూహాలను రచిస్తోంది.

టెంప్టింగ్ బాల్స్‌తో ధాటిగా ఆడేలా రెచ్చగొట్టి ఫలితం రాబట్టాలనుకుంటోంది. సోమవారం ఆసీస్ ప్రాక్టీస్ క్యాంప్‌కు సంబంధించిన వీడియోలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మెగా ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ గాయంతో స్వదేశం పయనమయ్యాడు. అతని స్థానంలో స్కాట్ బోలాండ్ ఆడే అవకాశం ఉంది.

ఇక ఆసీస్ ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది.

Story first published: Monday, June 5, 2023, 21:30 [IST]
Other articles published on Jun 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+