Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: ఈ నలుగురు చెలరేగితే టీమిండియాదే విజయం!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ మెగా మ్యాచ్‌కు తెరలేవనుంది. లండన్‌లోని ఓవల్ మైదానం ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. మేటి జట్లు అయిన ఆస్ట్రేలియా, భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ప్రిపరేషన్స్‌ను పూర్తి చేసుకున్నాయి.

గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియాకు ఇది సువర్ణావకాశం. ఈ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి ఆ కలను నెరవేర్చుకోవాలని టీమిండియాతో పాటు యావత్ భారత్ ఆకాంక్షిస్తోంది. అయితే ఈ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు అంత తేలిక కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

 WTC Final 2023:

భీకరమైన పేస్‌ దళం, పైగా వారికి అనుకూలించే పరిస్థితులు.. ఇవే ఆస్ట్రేలియాను ఫేవరెట్‌గా నిలబెడుతున్నాయి. కాబట్టి రోహిత్‌కు ఈ మ్యాచ్‌ కఠిన పరీక్షగానే భావిస్తున్నారు. కానీ కఠిన ప్రత్యర్థిని, ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని పైచేయి సాధిస్తే.. ఆ విజయానికి వచ్చే విలువే వేరు. ఆ కోణంలో చూస్తే టీమిండియాకు ఇది మంచి అవకాశం.

ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే నలుగురు ఆటగాళ్ల సత్తా చాటాలి. ఈ నలుగురు చెలరేగితే టీమిండియా విజయం సునాయసమే. ఆ ఆటగాళ్లెవరో లుక్కెద్దాం.

1. విరాట్ కోహ్లీ..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. టీమిండియా బ్యాటింగ్‌కు బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విరాట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

నాలుగు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ సాయంతో 297 పరుగులు చేశాడు. పైగా అతనికి ఆసీస్‌పై మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం కూడా ఉంది. కానీ ఓవల్ మైదానంలోనే సరైన రికార్డు లేదు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడెంకల స్కోర్ అందుకుంటే టీమిండియా ఛాంపియన్‌గా నిలవడం ఖాయం.

2. రోహిత్ శర్మ..
కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడం అత్యంత కీలకం. కొత్త బంతిని ఎదుర్కొనే రోహిత్ శర్మ.. క్రీజులో నిలబడి టీమిండియాకు శుభారంభం అందిస్తే.. ఇతర బ్యాటర్ల పని సులువవుతోంది. గ్రీన్ వికెట్‌పై బంతి పాత బడే వరకు ఆడటం చాలా ముఖ్యం. అయితే రోహిత్ శర్మ ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓ సెంచరీతో 242 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఓవల్ మైదానంలో అతనికి ఓ సెంచరీ ఉంది. అదే జోరును కొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు.

3. మహమ్మద్ షమీ...
టీమిండియా ప్రధాన పేసర్ మహమ్మద్ షమీ సత్తా చాటడం టీమిండియాకు చాలా ముఖ్యం. ఓవల్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో షమీ చెలరేగితే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. ఇంగ్లండ్‌లో షమీకి మెరుగైన రికార్డు ఉంది. 13 మ్యాచ్‌ల్లో అతను 38 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా లేని లోటును షమీ తీరిస్తే టీమిండియాకు తిరుగుండదు.

 WTC Final 2023:

4. రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాణించడంపై టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా.. అదే జోరును డబ్ల్యూటీసీ ఫైనల్లో కొనసాగించాల్సిన అవసరం ఉంది.
లోయార్డర్‌లో బ్యాట్‌తో.. ఇటు బౌలింగ్‌లో అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

జడేజా ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషిస్తే టీమిండియా ఛాంపియన్‌గా నిలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడేజా 22 వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేశాడు.

Story first published: Tuesday, June 6, 2023, 20:26 [IST]
Other articles published on Jun 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+