Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: భారత తుది జట్టులో మార్పులు.. ఇషాంత్ బదులు సిరాజ్!

WTC Final 2021: Lots Of Confusion In Picking India Playing 11 vs New Zealand

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాస్ కూడా పడకుండా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పిచ్ పరిస్థితులు మారే అవకాశం ఉంది. పిచ్‌పై గంటల కొద్దీ కవర్లు కప్పి ఉంచడం వల్ల మాయిశ్చర్ ఉండనుంది. ఇది స్వింగ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. అయితే ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకుంది.

కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సైతం అత్యవసరమైతే మార్పులు చేస్తామని హింట్ ఇచ్చాడు. దాంతో ఫైనల్ ఎలెవన్‌లో మార్పులు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

 సిరాజ్ X ఇషాంత్..

సిరాజ్ X ఇషాంత్..

ఒకవేళ మార్పులు చేస్తే ఎవరిని తీసుకోవాలని, మరెవరిని పక్కనెపెట్టాలనే విషయంలో గందరగోళం నెలకొంది. ఇక పిచ్‌పై మాయిశ్చర్, మబ్బులు ఉన్న నేపథ్యంలో స్వింగ్ బౌలర్ అవసరం. కానీ భారత తుది జట్టులో ఉన్న ముగ్గురు వేగవంతమైన పేసర్లే కానీ స్వింగ్ బౌలర్లు కాదు. మహ్మద్ సిరాజ్ ఒక్కడే స్వింగ్ బౌలర్. కాబట్టి ఇషాంత్ శర్మ స్థానంలో సిరాజ్‌ను తీసుకుంటారా? లేదో చూడాలి. వాస్తవానికి ముందు నుంచి సిరాజ్ తుది జట్టులో ఉంటాడని భావించినా... టీమ్‌మేనేజ్‌మెంట్ ఇషాంత్ అనుభవానికి ఓటేసింది. కానీ వర్షం కారణంగా పరిస్థితులు మారడంతో ఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగించాలా? అనే విషయంలో ఎటు తేల్చుకోలేకపోతుంది.

స్పిన్నర్ అవసరమా?

స్పిన్నర్ అవసరమా?

ఇక పిచ్‌పై బాగా ఎండకాస్తనే స్పిన్నర్లకు అనుకూలించనుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడటం లేదు కాబట్టి మరో స్పిన్నర్ అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. టీమిండియా మేనేజ్‌మెంట్ ఇదే భావిస్తే రెండో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజాపై వేటు వేయనుంది. అయితే జడేజాను వేటు వేసి అదనపు బ్యాట్స్‌మన్ తీసుకోవాలా? లేక పేసర్‌ను తీసుకోవాలా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. అదనపు పేసర్‌ను తీసుకుంటే బ్యాటింగ్ బలహీనంగా మారనుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేని తరుణంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవడం ఉత్తమమని గవాస్కర్ వంటి దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. విహారిని అదనపు బ్యాట్స్‌మెన్‌గా తీసుకుంటే పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా కూడా పనికిరానున్నాడు.

 శార్దూల్ ఉండి ఉంటే..

శార్దూల్ ఉండి ఉంటే..

ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో శార్దూల్ పేరును ప్రకటించాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని జట్టులోకి తీసుకుంటే కలిసొచ్చేదని, అతను స్వింగ్ రాబట్టడంతో పాటు బ్యాటింగ్ కూడా సమర్థవంతంగా చేయగలడని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్యా విలువ ఏంటో తెలిసొస్తుందని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు హార్దిక్ పాండ్యా సరిగ్గా సరిపోయేవాడని అంటున్నారు. కానీ టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ కోసం అతన్ని కాపాడుకుంటున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లు పాండ్యా కేవలం బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు.

టాస్ గెలిస్తే ఫీల్డింగ్..

టాస్ గెలిస్తే ఫీల్డింగ్..

ఇక నిన్నటి వరకు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని సూచించిన క్రికెట్ ఎక్స్‌పెర్ట్స్ వర్షంతో మారిన పరిస్థితులతో తమ మాటను కూడా మార్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. పిచ్‌పై మాయిశ్చర్ స్వింగ్ బౌలర్లకు అనుకూలిస్తుందని చెబుతున్నారు. అలాగే మాయిశ్చర్ కలిగిన పిచ్‌పై అశ్విన్ రాణించగలడని, భారత్ టాస్ గెలిస్తే ఫీల్డింగే తీసుకోవాలంటున్నారు. దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఫీల్డింగ్ తీసుకోవడం అడ్వాంటేజ్ అవుతుందన్నాడు.

Story first published: Saturday, June 19, 2021, 14:19 [IST]
Other articles published on Jun 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+