WTC Final 2021: మ్యాచ్ ఎన్ని గంటలకు ఏ చానెల్‌లో వస్తుందంటే..? అంపైర్లు ఎవరంటే..?

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరో 5 రోజుల్లో ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడం.. ఫైనల్లో రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్‌కు చేరి ఈ సూపర్ మ్యాచ్ కోసం సమాయత్తం అవుతున్నాయి. ఓవైపు న్యూజిలాండ్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంటే.. మరోవైపు టీమిండియా ఇంట్రా స్క్వాడ్‌లతో ముమ్మర సాధన చేస్తోంది.
అయితే ఇంగ్లండ్ పరిస్థితులు న్యూజిలాండ్‌కు అడ్వాంటేజ్ అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా ఆ జట్టుపై భారీ అంచనాలు లేకపోవడం కూడా వారి పనిని సులువు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ చానెల్‌లో లైవ్ వస్తుంది, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ ఏంటీ, మ్యాచ్ అఫిషియల్స్ ఎవరు? అనే విషయాలు తెలుసుకుందాం.

అంపైర్ల వివరాలు..
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ఐసీసీ మంచి అనుభవం కలిగిన అఫిషియల్స్‌ను నియమించింది. మ్యాచ్ రిఫరీగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ క్రిస్ బ్రాడ్‌ను నియమించిన ఐసీసీ.. ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఎలైట్ ప్యానెల్‌లోని రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్‌ల పేర్లను ప్రకటించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోని రిచర్డ్ కెటిల్ బరోను టీవీ అంపైర్‌గా.. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్‌కు చెందిన అలెక్స్ వార్ఫ్ నాలుగో అంపైర్‌గా నియమించింది.
ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్
థర్డ్ అంపైర్: రిచర్డ్ కెటిల్ బరో
ఫోర్త్ అంపైర్: అలెక్స్ వార్ఫ్
మ్యాచ్ రిఫరీ: క్రిస్ బ్రాడ్

మ్యాచ్ ఎన్నిగంట్ల కంటే..?
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ మైదానం వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఐసీసీ జూన్ 23ని రిజర్వ్‌డేగా కేటాయించింది. ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో కోల్పోయిన ఆటను చివరి రోజు ఆడించనున్నారు. అయితే దీనిపై ఐదో రోజు చివరి గంటలో మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకోనున్నాడు. ఆట అవసరమని భావిస్తేనే రిజర్వ్‌డేను ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఫలితం తేలని పరిస్థితిల్లో మ్యాచ్‌గా డ్రాగా పరిగణించి ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఇక భారత కాలమానం ప్రకారం సాయంత్ర 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఏ చానెల్‌లో వస్తుందంటే..?
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. స్టార్ నెట్‌వర్క్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు చానెల్స్‌లో కూడా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సంబంధించిన ఆన్‌లైన వేదికల్లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. డీస్నీ+హాట్ స్టార్‌లో కూడా రానుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో మాత్రం స్కై స్పోర్ట్స్ చానెల్‌లో మ్యాచ్ రానుంది. సౌతాఫ్రికాలో కూడా ఈ మ్యాచ్ ప్రసారం కానుంది.
ఫ్రీగా చూడాలంటే..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను జియో టీవీ యాప్, ఎయిర్‌టెల్ టీవీ యాప్ ద్వారా ఫ్రీగా వీక్షించవచ్చు. స్మార్ట్ ఫోన్స్, లాప్ ట్యాప్స్, టాబ్లెట్ స్క్రీన్స్‌లో కూడా ఈ యాప్‌ల సాయంతో మ్యాచ్‌ను ఫ్రీగా చూడవచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్..
టెస్ట్ క్రికెట్‌లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు రికార్డులు గమనిస్తే కోహ్లీసేనదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆటగాళ్ల పరంగా భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్ కివీస్‌పై దుమ్మురేపాడు.
15 మ్యాచ్‌ల్లో 1659 రన్స్ చేశాడు. కివీస్ నుంచి బ్రెండన్ మెకల్లమ్‌కు మెరుగైన రికార్డు ఉంది. అతను 10 మ్యాచ్‌ల్లో 1224 రన్స్ చేశాడు. ఈ తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీకి మెరగైన రికార్డు ఉంది. అతను కివీస్‌పై ఇప్పటికే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 773 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌లో రాస్ టేలర్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. అతను 812 రన్స్ చేశాడు. అయితే గతేడాది ఆరంభంలో న్యూజిలాండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో భారత్ చిత్తుగా ఓడింది. ఇక ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై టీమిండియాకు చెత్త రికార్డు ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications