WTC ఫైనల్లో కివీస్ మెరుగ్గా కనిపిస్తున్నా.. భారత్‌కే విజయవకాశాలు ఎక్కువ: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రస్తుతం మెరుగ్గా కనిపిస్తున్నా పరిస్థితులు మారుతాయని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. చాలా త్వరగా ఈ మ్యాచ్ భారత్‌వైపు తిరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇరు జట్ల విజయవకాశాలు చర్చించిన.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ఇప్పటికీ ఇరు జట్లకు సమానంగా ఉందని, త్వరలోనే పరిస్థితులు భారత్‌కు అనుకూలిస్తాయని చెప్పాడు.

భారత్ కూడా ఇలానే...
'చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉండటంతో విలియమ్సన్ టీమ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు అందరికి అనిపిస్తోంది. కానీ నాకు మాత్రం అలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించాలంటే ఇక్కడి నుంచి ఆ జట్టు ఇంకో 216 పరుగులు చేయాలి. అలా కాకుండా మరో 150 పరుగులకే ఆలౌటైతే కివీస్ వెనుకంజలో ఉన్నట్లే. టీమిండియా కూడా ఒకానొక స్థితిలో 146/3 స్కోరుతో మెరుగ్గా ఉంది. అప్పటికి ఇద్దరు మేటి ఆటగాళ్లు క్రీజులో ఉన్నారు. అయినా, చివరికి 217 పరుగులకే ఆలౌటయ్యారనే విషయం మరవద్దు.

స్వింగ్ ఒక్కటే..
ఈ లెక్కనే ఇరు జట్ల ఆటగాళ్లను పోల్చి చూసినా కోహ్లీసేనే బలంగా కనిపిస్తోంది. కివీస్ జట్టులో బాగా ఆడేవారున్నా నాణ్యమైన క్రికెటర్లు లేరు. చివరగా టీమిండియా ఆత్మవిశ్వాసమే ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలుపుతుంది. భారత జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అశ్విన్, జడేజాపై నమ్మకంతోనే తుదిజట్టులోకి తీసుకున్నారు. గతంలోనూ క్లిష్ట పరిస్థితుల నుంచి కోలుకొని వారు బాగా ఆడారు., ఇప్పుడు కూడా అలాగే ఆడతారు. స్వింగ్ రాబట్టడం మినహా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రేపు ఈ లోపాన్ని సరిదిద్దుకొని బరిలోకి దిగుతారు. జట్టులో ఉన్న ఏకైక స్వింగ్ బౌలర్ ఇషాంత్ రాణిస్తాడు. పిచ్‌పై టర్న్ లభిస్తుంది కాబట్టి అశ్విన్ కూడా కీలకం అవుతాడు'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

116 రన్స్ వెనుకంజలో..
న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్ సీమర్ కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications