Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ‌లో మారని భారత్ స్థానం!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం గాలే వేదికగా ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ స్థానం ఏం మారలేదు. కానీ భారత్ విజయాల శాతం మెరుగైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 48.15 శాతంగా ఉండగా.. ఈ విజయం తర్వాత 53.55 శాతానికి పెరిగింది. విన్నింగ్ పర్సంటేజి పెరిగినప్పటికీ భారత్‌ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌, భారత్ మధ్య చాలా తేడా ఉంది.

ఈ పాయింట్స్‌ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కనీసం 6 టెస్ట్‌ల్లో గెలవాలి. శ్రీలంకతో మరో టెస్ట్ ఆడాల్సి ఉండగా.. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌లు, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది.

WTC 2027 India World Test Championship Qualification Hopes Brighten After Victory Over Sri Lanka in 1st Test

ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.78 శాతంతో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో ఓడినా ఆ జట్టు టాప్ ప్లేస్ కోల్పోలేదు. 75 విన్నింగ్ పర్సంటేజీతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్(72.22), బంగ్లాదేశ్(66.67) భారత్ కంటే ముందున్నాయి. ఇంగ్లండ్(24.36), పాకిస్థాన్(22.22), వెస్టిండీస్(20.83) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్ చేతిలో ఎదురైన పరాజయంతో శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీలంక ఈ సైకిల్‌లో ఇంకా 7 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. భారత్‌తో మరో టెస్ట్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్‌లో విదేశీ సిరీస్‌లు, సౌతాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌లు శ్రీలంకకు ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు 33.33 విన్నింగ్ పర్సంటేజీతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్‌ ఆగస్ట్ 23 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)

భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 206 ఆలౌట్ (ధనంజయ డిసిల్వా 59 , సోనాల్ దినుషా 84)

Story first published: Wednesday, August 19, 2026, 17:20 [IST]
Other articles published on Aug 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+