Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AUS: న్యూజిలాండ్ ఘోర పరాజయం.. అగ్రస్థానంలో భారత్!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఘోర పరాజయం.. భారత్‌కు కలిసొచ్చింది. ఆదివారం ముగిసిన టెస్ట్‌లో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దాంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న భారత్.. 64.58 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆసీస్‌తో తొలి టెస్ట్ ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న కివీస్ 60 శాతం విన్నింగ్ పర్సంటేజీతో రెడో స్థానానికి పడిపోయింది.

59.09 శాతంతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ వర్సెస్ ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్ట్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ విజయాల శాతం మరింత మెరుగువ్వనుంది. ఓడితే మాత్రం మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.

WTC 2025 India Move To Top Of WTC Points Table After Australia Beat New Zealand In 1st Test

ఇప్పటికే భారత్ వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అరంగేట్ర ఎడిషన్‌లో న్యూజిలాండ్.. ద్వితీయ ఎడిషన్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. కనీసం ఈసారైనా టెస్ట్ గదను అందుకోవాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(275 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. 176 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నాడు.

అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ(43) మినహా అంతా విఫలమయ్యారు. 184 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 164 పరుగులకే ఆలౌటైంది. గ్లేన్ ఫిలిప్స్(5/45) సంచలన ప్రదర్శన కనబర్చాడు.

369 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 196 పరుగులకు కుప్పకూలింది. రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 59), డారిల్ మిచెల్(130 బంతుల్లో 2 ఫోర్లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

టామ్ లాథమ్(8), విల్ యంగ్(15), కేన్ విలియమ్సన్(9), టామ్ బ్లండెల్(0), గ్లేన్ ఫిలిప్స్(1) దారుణంగా విఫలమయ్యారు. టేయిలెండర్ స్కాట్ కుగ్గెల్‌జిన్(26) పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 6 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్‌కు తలో వికెట్ దక్కింది. భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కామెరూన్ గ్రీన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Sunday, March 3, 2024, 12:24 [IST]
Other articles published on Mar 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+