Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాపై సిరీస్ విజయం.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

టెస్ట్ ఫార్మాట్ సీజన్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. 45 రోజుల సుదీర్ఘ విశ్రాంతి తర్వాత.. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితం తేలడం కష్టమనుకున్న రెండో టెస్ట్‌లో అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

దాంతో ఫలితం తేలడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా అటాకింగ్ గేమ్‌తో ఏకపక్ష విజయాన్ని సాధించింది. బౌలర్ల అసాధారణ ప్రదర్శన, బ్యాటర్ల రిస్క్ అటాకింగ్ గేమ్ టీమిండియాకు కలిసొచ్చింది.

WTC 2025 How India can qualify for the WTC final after Bangladesh Test series win

ఈ సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా తమ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగుమం చేసుకుంది.

డబ్ల్యూటీసీ 2025లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా 8 విజయాలతో పాటు ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత జట్టు 74.27 విజయాల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా మరో 8 టెస్ట్‌లు ఆడనుంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్, నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్ట్‌లు ఆడనుంది. ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే... ఈ 8 మ్యాచ్‌ల్లో మూడు గెలవాలి. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినా.. ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతోంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు బలహీనంగా మారింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో దారుణంగా ఓటమిపాలైంది. ఒక్క మ్యాచ్‌ను కూడా డ్రా చేసుకోలేకపోయింది. ప్రస్తుతం భారత్‌కు ఉన్న ఫామ్ నేపథ్యంలో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేయడం అంత కష్టమేమి కాదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, October 1, 2024, 17:46 [IST]
Other articles published on Oct 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+