Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2025: ఆసీస్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో టెస్ట్‌లో మాత్రం చిత్తయ్యింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్( డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది.

భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. 60.71 విన్నింగ్ పర్సంటేజీతో ఆసీస్ అగ్రస్థానంలో ఉంటే.. 59.26 పర్సంటేజీతో సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. పింక్ బాల్ టెస్ట్‌లో ఓడిన భారత్.. 57.29 పర్సంటేజీతో మూడో స్థానానికి పరిమితమైంది.

WTC 2025 How can India qualify for WTC final 2025 after Adelaide Test loss to Australia

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే.. ఆసీస్‌తో జరగబోయే చివరి మూడు టెస్ట్‌లను గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతోంది. చివరి మూడు టెస్ట్‌ల్లో గెలవకపోతే.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ 2025 సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్‌ కాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంకా సిరీస్‌లు ఉన్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనున్నాయి.

ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2తో గెలుచుకుంటే డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌లో 58.77 విన్నింగ్ పర్సెంటేజ్ సాధిస్తోంది. అప్పుడు ఆస్ట్రేలియా 55.26 విన్నింగ్ పర్సెంటేజ్ సాధిస్తోంది. సౌతాఫ్రికా శ్రీలంక, పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు గెలిస్తే 69.44 పాయింట్స్‌తో ఫైనల్ బెర్త్ సాధిస్తోంది. భారత్ 3-1తో సిరీస్ గెలిచినా ఫైనల్ బెర్త్ దక్కుతోంది. కానీ 2-2తో డ్రా చేసుకున్నా.. సిరీస్ కోల్పోయినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది.

పింక్ బాల్ టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోర్ చేసి 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 19 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.

Story first published: Sunday, December 8, 2024, 11:48 [IST]
Other articles published on Dec 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+