వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్( డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డపై శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది. తాజా విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో సౌతాఫ్రికా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 63.33 విజయాల శాతంతో ఆసీస్‌ను వెనక్కినెట్టి తొలి స్థానంలో నిలిచింది.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో సౌతాఫ్రికా సొంతగడ్డపై పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా.. సౌతాఫ్రికా ఫైనల్ బెర్త్ ఖరారు అవుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందడుగు వేయడంతో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

వరుసగా మూడోసారి టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా జరుగుతున్న ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలి మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడినా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2తో గెలిచినా.. 64.05 విజయాల శాతంతో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తోంది. 3-1తో గెలిచినా 60.52 శాతంతో ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఆసీస్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకున్నా.. 2-3తో సిరీస్ కోల్పోయినా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ చేజారుతోంది. భారత్ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు అయినా గెలవాలి.
INDIA'S WTC FINAL SCENARIO 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2024
Win BGT 4-1 or 3-1 - India qualifies.
Win BGT 3-2 - India qualifies if SL beat Aus in one of two Tests.
If BGT 2-2 - India qualifies if SL beat Aus 2-0.
If India lose BGT 2-3 - India qualifies if Pak beat SA 2-0 & Aus beat SL in one of two Tests. pic.twitter.com/WQsAbn848m
ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. ఆ జోరును మాత్రం కొసాగించలేకపోయింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో మాత్రం టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పింక్ బాల్‌తో డే/నైట్ ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో తేలిపోయింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది.