ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో పడిలేచిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు సాధించింది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2027 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా మూడో స్థానానికి ఎగబాకింది.

భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 ఎడిషన్ ప్రారంభమైంది. ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్ 28 పాయింట్స్, 46.67 విన్నింగ్ పర్సంటేజితో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ కూడా 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి ఒకటి డ్రా చేసుకున్నా.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు ఖాతాలో నుంచి ఐసీసీ రెండు పాయింట్స్ కోత విధించింది. దాంతో ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 26 పాయింట్స్ 43.33 విన్నింగ్ పర్సంటేజితో ఉంది.
వెస్టిండీస్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ 100 విన్నింగ్ పర్సంటేజితో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక 2 టెస్ట్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి మరొకటి ఓడి 66.67 పర్సంటేజితో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఐదో స్థానంలో ఉండగా... ఖతా తెరవని వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉంది.
ఈ సైకిల్ పూర్తయ్యేలోపు అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. తొలి రెండు ఎడిషన్స్‌లో ఫైనల్ చేరిన భారత్ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. తొలి ఎడిషన్‌లో న్యూజిలాండ్, రెండో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన మూడో ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్నందుకుంది.