Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC ఫైనల్ గెలవాలంటే టీమిండియా అతన్ని ఆడించాలి: ఆసీస్ మాజీ క్రికెటర్

WTC 2023: Shane Watson says Hardik Pandya has got incredible skills to play red-ball cricket

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో గెలుచుకున్న టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌లో ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతోనే అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా..

2021లో ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలను కూడా సిద్దం చేస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం..

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం..

ఐపీఎల్ 2023 ముగిసిన 9 రోజులకే ఈ బిగ్ మ్యాచ్‌ ఉండటం టీమిండియాకు సవాల్‌గా మారింది. అయితే ఐపీఎల్ జరగుతుండగానే డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్స్ మొదలుపెడతామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మే 21 వరకు 6 జట్లు ఐపీఎల్ 2023 సీజన్ నుంచి నిష్క్రమిస్తాయని, ఆయా జట్లలో ఉండి.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగమయ్యే ఆటగాళ్లను ముందుగానే ఇంగ్లండ్‌కు పంపిస్తామని రోహిత్ తెలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ జరుగుతుండగానే.. పేసర్ల‌కు డ్యూక్ బాల్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయిస్తామని, డబ్ల్యూటీసీలో భాగమయ్యే ప్రతీ ఒక్కరిని మానిటర్ చేస్తామని పేర్కొన్నాడు.

హార్దిక్ పాండ్యాను ఆడిస్తే..

హార్దిక్ పాండ్యాను ఆడిస్తే..

మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలంటే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ సూచించాడు. అతను జట్టులో ఉంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ బలోపేతం అవుతుందని, ఇంగ్లండ్ కండిషన్స్‌కు అతని బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. 'హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే టెస్ట్ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేయించాలి. అతని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు టీమిండియాకు చాలా ముఖ్యం. టెస్ట్‌ల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయలేకపోయినా.. జట్టులో ఉండేందుకు అతని బ్యాటింగ్ స్కిల్స్ సరిపోతాయి.

పేస్ ఆల్‌రౌండర్ కీలకం..

పేస్ ఆల్‌రౌండర్ కీలకం..

అతను జట్టుకు కావాల్సిన పవర్ హిట్టర్. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించిన హార్దిక్ పాండ్యా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో పవర్ హిట్టర్ పాత్ర పోషించకపోయినా తన ఆటతీరుతో జట్టును విజయ తీరాలకు ఎలా చేర్చాలో బాగా తెలిసిన ఆటగాడు. ఫిట్‌గా ఉంటే బౌలింగ్‌లో అతను వేసే ఓవర్లు జట్టుకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అతను కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు.

స్వింగ్ చేయగలడు..

స్వింగ్ చేయగలడు..

ఇంగ్లండ్ పిచ్‌పై స్వింగ్ బౌలింగ్ చాలా కీలకం. పేస్‌కు అనుకూలంగా వికెట్‌పై పేస్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం చాలా కీలకం. వారు టీమ్ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను టీమిండియా గెలవాలనుకుంటే హార్ధిక్ పాండ్యా వంటి స్పెషల్ టాలెంటెడ్ పేస్ ఆల్‌రౌండర్లను ఆడించాలి.'అని షేన్ వాట్సన్ సూచించాడు.

Story first published: Tuesday, March 14, 2023, 18:25 [IST]
Other articles published on Mar 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+