Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌పై విజయం.. రెండో స్థానంలోకి టీమిండియా!

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా దుమ్మురేపింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

ఈ విజయంతో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ టెస్ట్ పరాజయంతో రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయిన భారత్.. వైజాగ్ టెస్ట్ గెలుపుతో ఐదు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది.

WTC 2023-25: India jump to 2nd spot after 106-run win against England in Vizag Test

ప్రస్తుతం భారత్ 52.77 విజయాల శాతంతో ఆసీస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్-5లో ఉన్న జట్లకు అగ్రస్థానంలో ఉన్న ఆసీస్‌కు ఐదు శాతం మాత్రమే తేడా ఉంది.

ఆ స్ట్రేలియా 55 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ (52.77), సౌతాఫ్రికా(50), న్యూజిలాండ్(50), బంగ్లాదేశ్(50) విన్నింగ్ పర్సంటేజీతో టాప్-5లో కొనసాగుతున్నాయి. పాకిస్థాన్(36.66), వెస్టిండీస్(33.33), ఇంగ్లండ్(25), శ్రీలంక(0) చివరి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 గెలవడంతో పాటు మూడింటిలో ఓడింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారత్ ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి, 2 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

వైజాగ్ టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు.

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

దాంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదమవ్వగా.. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బెన్ ఫోక్స్(69 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్‌తో 36), టామ్ హార్ట్‌లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(3/72), జస్‌ప్రీత్ బుమ్రా(3/46) మూడేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Monday, February 5, 2024, 17:42 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+