WTC 2021-2023: రెండో ఎడిషన్ కోసం కొత్త పాయింట్ల పద్ధతి.. షెడ్యూల్ ఇదే!!

దుబాయ్: క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) గత నెలలో ఘనంగా ముగిసింది. విశ్వవిజేతగా న్యూజిలాండ్.. రన్నరప్‌గా భారత్ నిలిచాయి. కరోనా వైరస్, బయో బుడగలు వంటి అడ్డంకులు ఎదురైనా.. డబ్ల్యూటీసీ 1 ఊహించిన దానికన్నా ఎక్కువే విజయవంతం అయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్ఠి డబ్ల్యూటీసీ-2పై పడింది. ఇది 2021-2023 మధ్య జరగనుంది. దీనికోసం కొత్త పాయింట్ల వ్యవస్థను, ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు, ఏ ఏ జట్లు ఆడబోతోందన్న షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం రిలీజ్ చేసింది.

ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు
డబ్ల్యూటీసీ-2లో సిరీస్‌లోని మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా.. గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు ఇవ్వబడతాయి. పర్సెంటేజ్ పాయింట్ల రూపంలో చెప్పాలంటే 100. ఒకవేళ టై అయితే 6 (50 పర్సెంటేజ్ పాయింట్లు), డ్రా అయితే 4 (33.33 పర్సెంటేజ్ పాయింట్స్) పాయింట్లు కేటాయించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అదే విధంగా పాయింట్ల శాతం ఆధారంగా ఆయా జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు ఐసీసీ పేర్కొంది. డబ్ల్యూటీసీ-1లో ఒక టెస్ట్ సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మ్యాచుల సంఖ్యను బట్టి పాయింట్లు ఉండేవి. అది అభిమానులలోనే కాకుండా జట్లలో కూడా చాలా గందరగోళాన్ని సృష్టించింది.

పాయింట్ల లెక్కింపు సులభతరం
డబ్ల్యూటీసీ-1లో ఫాలో అయిన పాయింట్ల పద్ధతిని ఐసీసీ ఇప్పుడు సులభతరం చేసింది. తాము అందుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఓ జట్టు డబ్ల్యూటీసీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్లను కౌంట్ చేసేలా ఈ కొత్త పద్ధతిని తీసుకొచ్చామని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డబ్ల్యూటీసీ-1లో కొన్ని సిరీస్‌లు జరగకపోవడంతో.. అందుబాటులో ఉన్న పాయింట్ల పర్సెంటేజ్ ఆధారంగా టీమ్స్‌కు ర్యాంకులు కేటాయించారు.
'టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే.. హార్దిక్ పాండ్యా ఆ పని చెయ్యక తప్పదు! లేదంటే?'
సొంతగడ్డపై 3, విదేశాల్లో 3
డబ్ల్యూటీసీ-2లో మొత్తం 9 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రతి జట్టూ ఆరు టెస్టు సిరీస్‌లను ఆడనుంది. ఇందులో మూడు సొంతగడ్డపై.. మిగిలిన మూడు విదేశాల్లో ఆడనున్నాయి. 2023, మార్చి 31 నాటికి డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రతి సిరీస్‌లోనూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. గరిష్ఠంగా ఐదు మ్యాచ్‌ల వరకూ ఆడొచ్చు. ఫైనల్ వేదిక, తేదీని ఐసీసీ ఇంకా ఖరారు చేయలేదు.
సిరీస్‌లోని మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్లు
2 మ్యాచ్‌ల సిరీస్- 24 పాయింట్లు
3 మ్యాచ్‌ల సిరీస్- 36 పాయింట్లు
4 మ్యాచ్‌ల సిరీస్- 48 పాయింట్లు
5 మ్యాచ్‌ల సిరీస్- 60 పాయింట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications