For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే.. హార్దిక్‌ పాండ్యా ఆ పని చెయ్యక తప్పదు! లేదంటే?'

Hardik Pandya needs to work a lot on his remodeled bowling action says Coach Jitendra Singh
Hardik Pandya Should Work On His Bowling Action For Longer Test Career - Jitendra Singh

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే.. తను మార్చుకున్న శైలిపైన ఎక్కువ కసరత్తు చేయాలని అతడి చిన్ననాటి కోచ్‌ జితేందర్‌ సింగ్‌ అంటున్నాడు. గతంలో హార్దిక్‌ ఫామ్‌ కోల్పోయినప్పుడు తామిద్దరం ఇలాగే కలిసి పనిచేశామని వెల్లడించాడు. హార్దిక్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు లంకకు వెళ్లిన విషయం తెలిసిందే.

మరింత కసరత్తు చేయాలి

మరింత కసరత్తు చేయాలి

శ్రీలంక పర్యటన నేపథ్యంలో జితేందర్‌ సింగ్‌ తాజాగాఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'హార్దిక్‌ పాండ్యా టెస్టు క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే మార్చుకున్న శైలిపైన మరింత కసరత్తు చేయాలి. 2016 ప్రపంచకప్‌ తర్వాత హార్దిక్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లోనూ అంతగా రాణించలేదు. అప్పుడు మేమిద్దరం బరోడా జట్టులో కలిసి పనిచేశాం. దాంతో హార్దిక్ భారత్‌-ఏకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి తన లయ అందుకున్నాడు' అని అన్నాడు.

నా కల తప్పక నెరవేరుతుంది

నా కల తప్పక నెరవేరుతుంది

చిన్నప్పటి నుంచీ హార్దిక్‌ పాండ్యా ఫాస్ట్‌ బౌలింగ్‌ చేయలేదని జితేందర్‌ సింగ్ తెలిపాడు. '15 లేదా 16 ఏళ్ల వయసులో హార్దిక్ ఎక్కువగా ఫాస్ట్‌ బౌలింగ్‌ వేయడం మొదలు పెట్టాడు. ఆలస్యంగా పేస్‌ బౌలర్‌ అయ్యాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. అందుకే పనిభారం తట్టుకొనేందుకు అతడి కండరాలకు కాస్త సమయం పడుతుంది. అంతర్జాతీయంగా తీరిక లేకుండా ఉండటంతో.. తన శైలిపై దృష్టి పెట్టేందుకు అతడికి కష్టమవుతోంది. సుదీర్ఘకాలం హార్దిక్ టెస్టు క్రికెట్‌ ఆడాలన్న నా కల తప్పక నెరవేరుతుంది. హార్దిక్ త్వరలోనే టెస్టు జట్టుకు ఎంపికవుతాడు' అని జితేందర్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Wimbledon 2021లో ఫిక్సింగ్‌ కలకలం.. రెండు మ్యాచ్‌ల‌పై విచార‌ణ‌!!

కేవలం బ్యాట్స్‌మన్‌గానే సేవలు

కేవలం బ్యాట్స్‌మన్‌గానే సేవలు

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలం. ఈ నేపథ్యంలో పాండ్యాకు తుది జట్టులో చోటు ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే భారత జట్టులో ప్రస్తుతం ఉన్న ఏకైక సీమ్ ఆల్‌రౌండర్ అతనే. అయితే గత కొద్దిరోజులుగా బౌలర్‌గా కాకుండా పాండ్యా కేవలం బ్యాట్స్‌మన్‌గానే సేవలందిస్తున్నాడు. కనీసం టీ20 మ్యాచ్‌లోనూ అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. దాంతో టీమిండియా సెలెక్టర్ టెస్టు జట్టులో అతన్ని పక్కకు తప్పించారు.

స్వల్ప సమయ మార్పులు

స్వల్ప సమయ మార్పులు

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్వల్ప సమయ మార్పులు చేసింది శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ). ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్డేలు అరగంట, 25 నుంచి ప్రారంభమయ్యే టీ20లు గంట ఆలస్యంగా ప్రారంభం అవనున్నాయి. ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాలి. ఇప్పుడు మధ్యాహ్నం 3, రాత్రి 8 గంటలకు మ్యాచులు స్టార్ అవ్వనున్నాయి. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29 తేదీల్లో జరగనున్నాయి.

Story first published: Wednesday, July 14, 2021, 14:05 [IST]
Other articles published on Jul 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+