
రిటైర్మెంట్ సలహా ఇచ్చాడంటూ..
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు సాహాను పక్కనపెట్టారు. అతనిపై వేటు వేయడానికి గల కారణాలను తెలియజేయాల్సి అవసరం లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మీడియాతో అన్నాడు. ఈ వ్యాఖ్యలతో కొంత అసంతృప్తికిలోనైనా సాహా.. ఓఇంటర్వ్యూలో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్‌పై ఆలోచన చేయాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడని ఆరోపించాడు.

దాదా భరోసా ఇచ్చినా..
న్యూజిలాండ్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్ అనంతరం బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రశంసిస్తూ జట్టులో చోటుపై భరోసా ఇచ్చాడని తెలిపాడు. కానీ ఇంతలోనే పరిస్థితులన్నీ మారిపోయాయని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం తనను ఇబ్బంది పెట్టాడని, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని సాహా ట్వీట్ చేశాడు. సదరు జర్నలిస్ట్ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

మాజీ క్రికెటర్ల మద్దతు..
ఇక సాహాకు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మద్దతు తెలపడంతో బీసీసీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. జర్నలిస్ట్ మేసేజ్ ఏపిసోడ్‌పై దర్యాప్తు జరుపుతున్నట్లు బోర్డు కోశాధికారి అరుణ్ ధూమల్ ప్రకటించాడు. సదరు జర్నలిస్ట్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని, క్రికెట్ సంబంధించిన వార్తలు రాయకుండా, ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేయకుండా జీవిత కాలం నిషేధం విధిస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన సాహా.. సదరు జర్నలిస్ట్ పేరు చెప్పనని స్పష్టం చేశాడు.

అతని పొట్ట కొట్టను..
‘ఇప్పటివరకూ బీసీసీఐ నన్ను సంప్రదించలేదు. ఒకవేళ నన్ను బెదిరించిన జర్నలిస్ట్ ఎవరని అడిగితే మాత్రం అతని కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశం నాకు లేదని చెబుతాను. అందుకే నేను ఆ ట్వీట్‌లో అతని పేరు వెల్లడించలేదు. ఇతరుల్ని ఇబ్బందులకు గురి చేసే రకం కాదు నేను. నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు. అయితే , నేను ఆ ట్వీట్ చేయడానికి గల కారణం. . మీడియాలోనూ ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడనే నిజాన్ని బయటపెట్టాలనే ఉద్దేశమే. అలా చేయడం మంచిది కాదు. నాకు అలా ఎవరు మెసేజ్‌లు చేశారో అది ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఇతర క్రికెటర్లు ఇలాంటివి ఎదుర్కోకూడదనే నేను ఈ విషయాన్ని ట్వీట్ చేశాను. ఆ వ్యక్తి తప్పు చేశాడనే విషయాన్ని బయటపెట్టాలనుకున్నా. మళ్లీ ఇలా ఎవరూ చేయకూడదనుకున్నా'అని సాహా వివరించాడు.


Click it and Unblock the Notifications












