Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్‌‌కు చుక్కలు చూపించిన భారత రెజ్లర్! (వీడియో)

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్‌కు భారత రెజ్లర్ సంగీత ఫోగట్ చుక్కలు చూపించింది. చాహల్‌ను అమాంతం తన భుజాలపై ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పింది. వదిలేయాలని చాహల్‌ ఎంత వేడుకున్నా.. ఆమె వినిపించుకోలేదు. కాసేపు తిప్పిన తర్వాత చాహల్‌ను కిందికి దించడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

'అమ్మాయిల జోలికి పోతే ఇలానే ఉంటుంది చాహల్'అని ఒకరంటే.. 'నీ సతీమణిపై ఉన్న కోపాన్ని నీ మీద తీర్చుకుంటుందని'అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం ఇది చాహల్‌ను అవమానపరిచినట్లేనని, బాడీ షేమింగ్‌ కిందకు వస్తుందని మండిపడ్డారు.

Wrestler Sangeeta Phogat lifts Yuzvendra Chahal and Spins Him Around Goes Viral

ఓ చానెల్ పాపులర్ హిందీ డ్యాన్స్ షో 'జలక్ దిఖ్లా జా'లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ షోలో చాహల్ సతీమణి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కంటెస్టెంట్‌గా పోటీపడుతోంది. ఈ షోలో సంగీత ఫోగట్ సైతం కంటెస్టెంట్‌గా బరిలో నిలిచింది. అయితే ధనశ్రీ వర్మ టాప్-5 ఫైనలిస్ట్‌లో నిలవగా.. సంగీత ఫోగట్ ముందే ఎలిమినేట్ అయ్యింది.

తాజాగా ఆమె ఈ షో ఫైనల్ సంబరాల్లో పాల్గొనగా.. చాహల్‌ను అమాంతం ఎత్తి గాల్లో తిప్పింది. భుజాలపై ఎత్తుకొని తిప్పడంతో భయపడిన చాహల్.. కిందికి దించాలని ఆమెను రిక్వెస్ చేశాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ షోలో ధనశ్రీ వర్మ ఫైనల్ చేరగా.. ఆమెకు పాపులర్ టీవీ యాక్టర్ షోయబ్ ఇబ్రహీమ్, మాజీ ఇండియన్ ఐడల్ విన్నర్, తెలుగు తేజం శ్రీరామ చంద్రతో గట్టి పోటీ ఎదురవుతోంది.

ఇప్పటికే సతీమణికి మద్దతుగా ఓటింగ్ రాబట్టేందుకు రంగంలోకి దిగిన చాహల్.. తన సహచర ఆటగాళ్లతో జనాలు ఓట్లు వేసేలా రిక్వెస్ట్ చేయించాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన అతను... ఇటీవల ప్రకటించిన బీసీసీఐ కాంట్రాక్ట్‌‌ల్లో ఏ కాంట్రాక్ట్ అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సమయాత్తం అవుతున్నాడు.

ఈ టోర్నీలో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికవ్వాలనే ఆశతో ఉన్నాడు. కానీ భారత సెలెక్టర్లు బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన స్పిన్నర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పై టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్ వేదికగా జరగనుండటంతో ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎంత అద్భుత ప్రదర్శన కనబర్చినా చాహల్ తుది జట్టులోకి రావడం కష్టం.

Story first published: Sunday, March 3, 2024, 13:02 [IST]
Other articles published on Mar 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+