Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL vs PSL: బాబర్ ఆజామ్ కంటే స్మృతి మంధానకు రెండున్నర రెట్లు ఎక్కువ!

 WPL vs PSL: Smriti Mandhana To Earn Double Than Babar Azam After Bagging A 3.4 Crore Deal With RCB

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) పరువు మరోసారి గంగలో కలిసింది. ప్రపంచంలోనే తమది బెస్ట్ లీగ్‌ అని చెప్పుకునే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. భారత్‌లో కొత్తగా ప్రారంభం కానున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)ను చూసి తల దించుకుంటున్నారు. ఐపీఎల్‌లో అమ్ముడుపోని ప్లేయర్లు, పాక్ సూపర్ లీగ్‌లో ఆడుతూ ఉంటారు. అలాంటిది తమ లీగే తోపని పీసీబీ అధికారులు గొప్పలు చెప్పుకుంటారు. ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ రమీజ్ రాజా అయితే సందర్భం వచ్చినప్పుడల్లా ఐపీఎల్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు.

పీఎస్‌ఎల్ పరువు తీసిన డబ్ల్యూపీఎల్..

పీఎస్‌ఎల్ పరువు తీసిన డబ్ల్యూపీఎల్..

అయితే ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐ ముందు పీసీబీ జుజుబీ అని మరోసారి నిరూపితమైంది. సోమవారం జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచింది. రూ.3.40 కోట్ల భారీ ధరకు స్మృతి మంధానను ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో రూ.3 కోట్ల 40 లక్షలు అంటే పాక్ రూపాయల్లో దాని విలువ రూ. 10 కోట్ల 72 లక్షలు. ఇదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, పాక్ సూపర్ లీగ్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్‌గా ఉన్నాడు.

బాబర్ కంటే స్మృతికే ఎక్కువ.

బాబర్ ఆజమ్ అందుకునే మొత్తం పాక్ కరెన్సీ ప్రకారం రూ.2 కోట్ల 30 లక్షలు. అదే భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 40 లక్షలు మాత్రమే. అంటే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ ఆజమ్ కంటే స్మృతి మంధాన రెండున్నరెట్లు ఎక్కువగా ఆర్జిస్తోంది. లక్షల కోట్ల బ్రాండ్ వాల్యూ కలిగిన ఐపీఎల్‌తో పోల్చుకునే పాక్ క్రికెటర్లు, ముందుగా ఇప్పుడిప్పుడే ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని దాటగలరేమో చూసుకోవాలని భారత అభిమానులు పాక్ క్రికెటర్లకు చురకలంటిస్తున్నారు. స్మృతి మంధానా, బాబర్ ఆజామ్ ధరలను పోల్చుతూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

2009 నుంచి నిషేధం..

2009 నుంచి నిషేధం..

సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో 2009 నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లో పాక్ ఆటగాళ్లను అనుమతించినా.. 2009 నుంచి నిషేధించారు. భారత మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా పాక్ మహిళా క్రికెటర్లకు అనుమతి దక్కలేదు. ఐపీఎల్ ఆడలేకపోతున్నామని చాలామంది పాక్ క్రికెటర్లు ఫీల్ అవుతుంటారు.ఐపీఎల్ ఆడే అదృష్టం దక్కడం లేదనే అక్కసుతోనే ఐపీఎల్‌పైనే నోరుపారేసుకుంటారు.

Story first published: Tuesday, February 14, 2023, 15:11 [IST]
Other articles published on Feb 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+