Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: అమ్మాయిల మెగా వేలం నేడే.. బరిలో 277 మంది ఆటగాళ్లు!

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలానికి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈ మెగా ఆక్షన్‌కు తెరలేవనుంది. మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న డబ్యూపీఎల్.. నాలుగో ఎడిషన్‌కు సిద్దమవుతుంది. ఈ మెగా ఆక్షన్‌లో జట్లన్నీ మారిపోనున్నాయి. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ పూర్తి కాగా.. ఐదు ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకున్నాయి. కొన్ని జట్లు మెగా ఆక్షన్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం తమకు కావాల్సిన ఆటగాళ్లను కూడా వదులుకున్నాయి. వేలంలో వారిని తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు.

73 స్థానం కోసం 277 మంది..

రిటెన్షన్ ప్రక్రియ తర్వాత ఐదు జట్లలో 73 స్థానాలు ఖాళీగా ఉండగా.. 277 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో 194 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 83 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. 194 మంది భారత ఆటగాళ్లలో 52 మంది క్యాప్‌డ్, 142 మంది అన్‌క్యాప్‌డ్ ఉండగా.. 83 మంది విదేశీ ప్లేయర్లలో 66 మంది క్యాప్‌డ్, 17 మంది అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఐదు జట్లలో ఖాళీగా ఉన్న 73 స్థానాల్లో 23 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది.

WPL Auction Today 277 Players Set to Go Under the Hammer in Women s Premier League 2026

ప్రతీ ఫ్రాంచైజీ కనిష్టంగా 15 మంది, గరిష్టంగా 18 మంది ఆటగాళ్లతో జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఈ వేలంలో ప్రతీ జట్టు ఐదు ఆర్‌టీమ్ కార్డ్‌లతో తమ పాత ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే ఆర్‌టీఎమ్ కార్డుల సంఖ్య రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఐదు జట్లు రూ.41.1 కోట్లను వేలంలో ఖర్చు చేయనున్నాయి. అత్యధికంగా యూపీ వారియర్స్ దగ్గర రూ.14.5 కోట్లు ఉన్నాయి.

స్టార్ ప్లేయర్లతో స్టార్ట్..

మార్క్యూ ప్లేయర్ల సెట్‌తో వేలం ప్రారంభం కానుంది. ఈ సెట్ 8 మంది ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. దీప్తి శర్మ, రేణుక సింగ్, సోఫీ డివైన్, అమేలియా కెర్, సోఫీ ఎక్లెస్టోన్, అలిస్సా హీలీ, మెగ్ లాన్నింగ్, లారా వోల్వార్డ్ట్ పేర్లు ముందుగా వేలంలోకి రానున్నారు.

ఎలా చూడాలంటే..?

గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మెగా వేలం స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.


ఐదు ఫ్రాంచైజీల రిటైన్ లిస్ట్ ఇదే

1. ముంబై ఇండియన్స్:

నాట్ సీవర్ బ్రంట్(రూ. 3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్(రూ.2.5 కోట్లు), హీలీ మాథ్యూస్(రూ.1.75 కోట్లు), అమన్ జోత్ కౌర్(రూ. కోటి), జీ కమిలిని(రూ.50 లక్షలు)

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.5.75 కోట్లు

2. ఢిల్లీ క్యాపిటల్స్:

జెమీమా రోడ్రిగ్స్(రూ.2.2 కోట్లు), మారిజానే కాప్(రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ(రూ. 2.2 కోట్లు), అన్నబెల్ సదర్లాండ్(రూ.2.2 కోట్లు), నికీ ప్రసాద్(రూ.50 లక్షలు)

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.5.7 కోట్లు

3. ఆర్‌సీబీ

స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రిచా ఘోష్(రూ.2.75 కోట్లు), ఎల్లిస్ పెర్రీ(రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్(రూ.60 లక్షలు)

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.6.5 కోట్లు

4.యూపీవారియర్స్:

శ్వేత సెహ్రావత్(రూ.50 లక్షలు)

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.14.5 కోట్లు

5. గుజరాత్ జెయింట్స్:

రిటెన్షన్ లిస్ట్: అష్లే గార్డ్‌నర్(రూ.3.5 కోట్లు), బెత్ మూనీ(రూ.2.5 కోట్లు)

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.9 కోట్లు

Story first published: Thursday, November 27, 2025, 10:58 [IST]
Other articles published on Nov 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+