Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL Auction 2024: ముగిసిన వేలం.. పూర్తి జట్లు ఇవే!

WPL Auction 2024: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం ముగిసింది. శనివారం ముంబై వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో మొత్తం 30 మంది ఆటగాళ్ల కోసం ఐదు ఫ్రాంచైజీలు రూ. 12.75 కోట్లు ఖర్చుపెట్టాయి. అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా.. ఆర్‌సీబీ ఏడుగురు, యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ ఐదుగురు, ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేశాయి.

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ అన్నెబెల్ సదర్లాండ్, భారత అనామక ప్లేయర్ కాశ్వీ గౌతమ్ అత్యధికంగా రూ. 2 కోట్ల ధర పలికారు. సదర్లాండ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, కాశ్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేశాయి.

 WPL Auction 2024: Full Squads of all 5 franchises after frenetic bidding day

ఫ్రాంచైజీల వారిగా కొనుగోలు చేసిన జాబితా:

1. గుజరాత్ జెయింట్స్:

ఫోబ్ లిచ్ఫీల్డ్(రూ. కోటి), మేఘన సింగ్(రూ. 30 లక్షలు), త్రిష పూజిత(రూ.10 లక్షలు), కాశ్వీ గౌతమ్(రూ. 2 కోట్లు), ప్రియా మిశ్రా(రూ.20 లక్షలు), లారెన్ చీట్లే(రూ. 30 లక్షలు), కాత్రిన్ బ్రీస్(రూ.10 లక్షలు), మన్నత్ కశ్యప్(రూ.10 లక్షలు), వేద కృష్ణమూర్తి(రూ.30 లక్షలు), తర్నమ్ పఠాన్

రిటైన్ లిస్ట్:
అశ్లే గార్డ్‌నెర్, బెత్ మూనీ, దయాలన్ హేమలత. హర్లీన్ డియోల్, లౌరా వోల్వార్డ్, సబ్నమ్ షకీల్, స్నేహ్ రాణా, తనుజా కన్వేర్

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
జార్జియో వార్హెమ్-రూ. 40 లక్షలు, కేట్ క్రాస్-రూ. 30 లక్షలు, ఎక్తా బిష్త్(రూ. 60 లక్షలు), సుభా సతీష్(రూ.10 లక్షలు), సిమ్రాన్ బహదుర్(రూ.30 లక్షలు), మేఘన(రూ.30 లక్షలు), సోఫీ మోలినక్స్(రూ. 30 లక్షలు)

రిటైన్ లిస్ట్
ఆశా షోబనా, దిశా కసత్, ఎల్లిస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రానీ రాయ్, కనిక అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, సోఫియా డివైన్

3. యూపీ వారియర్స్:
డేనియల్ వ్యాట్(రూ.30 లక్షలు), వ్రిందా దినేశ్(రూ. 1.30 కోట్లు), సైమా ఠాకూర్(రూ. 10 లక్షలు), గౌహెర్ సుల్తానా(రూ. 30 లక్షలు), పూనమ్ ఖేమ్నర్(రూ. 10 లక్షలు)

అలిస్సా హీలీ, అంజలి, సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారీస్, కిరణ్ నావ్‌గిరే, లారెన్ బెల్, లక్ష్మీయాదవ్, పరశ్వీ చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, యశస్రీ, స్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తాహిలా మెక్‌గ్రాత్

4. ఢిల్లీ క్యాపిటల్స్
అన్నబెల్ సదర్లాండ్(రూ.2 కోట్లు), అపర్ణ మోండల్(రూ.10 లక్షలు), అశ్వని కుమారి(రూ. 10 లక్షలు)

రిటైన్ లిస్ట్
అలిస్ క్యాప్సీ, అరుందతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, లౌరా హ్యారీస్, మరిజన్నే కాప్, మెగ్ లాన్నింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షెఫాలి వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తీ, తానియా భాటియా, టైటాస్ సంధు.

5. ముంబై ఇండియన్స్
షబ్నిమ్ ఇస్మాయిల్(రూ. 1.20 కోట్లు), సంజనా(రూ. 10 లక్షలు), అమన్‌దీప్ కౌర్(రూ. 10 లక్షలు), ఫాతిమా జాఫర్(రూ. 10 లక్షలు), కీర్తనా బాలకృష్ణ(రూ. 10 లక్షలు)

రిటైన్ లిస్ట్
అమన్‌జోత్ కౌర్, అమెలియా కెర్, చోలె ట్రైయాన్, హర్మన్ ప్రీత్ కౌర్, హీలీ మాథ్యూస్, హుమైరా ఖాజీ, ఇసాబెల్లె వాంగ్, జింటిమని కలితా, నటాలి సివర్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యస్తికా భాటియా.

Story first published: Saturday, December 9, 2023, 21:05 [IST]
Other articles published on Dec 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+