For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2026: చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్‌!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. యూపీ వారియర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూపీ కెప్టెన్ మెగ్‌లాన్నింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై పతనాన్ని శాసించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. మెగ్ లాన్నింగ్(45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), ఫోబే లిట్చ్‌ఫీల్డ్(37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో నాట్‌ సివర్ బ్రంట్ రెండు వికెట్లు తీయగా.. అమెలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టింది. నికోలా కేరీ, హీలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.

WPL 2026 UP Warriorz Defeat Mumbai Indians to Secure Second Win

అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది. అమెలియా కేర్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), అమన్‌జోత్ కౌర్(24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లో శిఖా పాండే(2/30) రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, సోఫీ ఎక్లేస్టోన్, దీప్తి శర్మ, చోలే ట్రయాన్ తలో వికెట్ తీసారు.

లక్ష్యచేధనలో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు హీలీ మాథ్యూస్(13), సజీవన్ సజన(10) నిరాశపర్చారు. దాంతో ముంబై పవర్ ప్లేలో 2 వికెట్లకు 38 పరుగులే చేసింది. ఆ వెంటనే నాట్ సివర్ బ్రంట్‌ను శిఖా పాండే పెవిలియన్ చేర్చింది. నికోలా కేరిని దీప్తి శర్మ ఔట్ చేయగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(18) ట్రయన్ వెనక్కి పంపింది. దాంతో ముంబై 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అమెలియా కేర్, అమన్‌జోత్ కౌర్ పోరాడారు. కానీ ఛేజింగ్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబైకి ఇది మూడో పరాజయం. రెండు సార్లు యూపీ వారియర్స్ చేతిలోనే ఓడటం గమనార్హం.

Story first published: Saturday, January 17, 2026, 19:19 [IST]
Other articles published on Jan 17, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+