డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం తర్వాత యూపీ వారియర్స్ భీకరంగా కనిపిస్తోంది. మహిళల క్రికెట్ చరిత్రలోనే మేటి కెప్టెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మెగ్ లానింగ్ చేరికతో ఆ జట్టు బలం పెరిగింది. మెగ్ లానింగ్ సారథ్యంలో టైటిల్ గెలవాలనే లక్ష్యంతో యూపీ వారియర్స్ బరిలోకి దిగుతోంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మెగ్ లానింగ్ ఫైనల్ చేర్చింది. యూపీ రాతను కూడా మారుస్తుందని ఆ ఫ్రాంచైజీతో పాటు అభిమానులు భావిస్తున్నారు.
జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్ 2026 లీగ్ ప్రారంభం కానుండగా.. యూపీ వారియర్స్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ టోర్నీ నేపథ్యంలో యూపీ వారియర్స్ బలాలు, బలహీనతలు, కీలక ఆటగాళ్లు, తుది జట్టు కాంబినేషన్‌పై ఓ లుక్కెద్దాం.

1.మెగ్ లానింగ్ సారథ్యంతో పాటు భారత అత్యుత్తమ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ జట్టుకు అతిపెద్ద బలం.
2.డియాండ్రా డాటిన్, సోఫీ ఎకిల్ స్టోన్, చార్లీ నాట్, క్లో ట్రయాన్ వంటి అత్యుత్తమ ఆల్‌రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం.
3.హర్లీన్ డియోల్, ప్రతీక రావల్ లాంటి టీమిండియా స్టార్లు.. కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్ లాంటి ప్రతిభావంతులు.. శిఖా పాండే లాంటి సీనియర్, క్రాంతి గౌడ్ లాంటి యువ పేసర్‌తో జట్టు బలం రెట్టింపు అయ్యింది.
4.ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ, ఆశా శోభనలతో కూడిన స్పిన్ విభాగం ప్రత్యర్థులను కట్టడి చేయగలదు.
1.బౌలింగ్‌లో డెప్త్ లేదు. శిఖా పాండే ఉన్నప్పటికీ, విదేశీ ఫాస్ట్ బౌలర్ల కొరత కనిపిస్తోంది. యువ పేసర్ క్రాంతి గౌడ్‌పై ఎక్కువ భారం పడే అవకాశం ఉంది.
2. మిడిలార్డర్‌లో కిరణ్ నవ్‌గిర్, హర్లిన్ డియోల్ వంటి వారు నిలకడగా రాణించాల్సి ఉంటుంది.
మెగ్ లానింగ్, కిరణ్ నవ్‌గిరే, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (వికెట్ కీపర్), డియాండ్రా డాటిన్ , చార్లీ నాట్, హర్లీన్ డియోల్,
శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, శిఖా పాండే, సోఫీ ఎకిల్‌స్టోన్, ఆశా శోభన, క్రాంతి గౌడ్
దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్, కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్, శిఖా పాండే, క్రాంతి గౌడ్, సుమన్ మీనా, ఆశ శోభన, సిమ్రన్ షేక్, గొంగడి త్రిష, షిప్రా గిరి, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డియాండ్రా డాటిన్, చార్లీ నాట్, క్లో ట్రయాన్, సోఫీ ఎకిల్ స్టోన్, టారా నోరిస్.