Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026 Retentions: ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే!

వన్డే ప్రపంచకప్ 2025 విజయంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. అర్థ శతాబ్దపు కలను సాకారం చేసుకుంది. భారత అమ్మాయిల విజయం వెనుక వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) పాత్ర కూడా ‌ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న డబ్ల్యూపీఎల్.. నాలుగో సీజన్ కోసం సమాయత్తమవుతుంది. ప్రపంచకప్ విజయం నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌కు ప్రేక్షకాదరణ మరింత రెట్టింపు కానుంది.

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఈ మెగా వేలం రిటెన్షన్ రూల్స్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా ఐదుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గరిష్టంగా ముగ్గురు భారత క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు, ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వేలం పర్స్ వాల్యూను రూ. 15 కోట్లుగా నిర్ణయించారు.

WPL 2026 Retentions 5 Teams Announce Retained and Released Players Ahead of Mega Auction

రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో తొలి ప్లేయర్‌కు రూ. 3.5 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 2.5 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 1.75 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ. 1 కోటి, ఐదో ప్లేయర్‌కు రూ.50 లక్షల ధరను బీసీసీఐ నిర్ణయించింది. గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు టైటిల్ గెలవగా.. ఆర్‌సీబీ ఒకసారి గెలిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమకు కలిసొచ్చే ఆటగాళ్లను రిటైన్ చేసుకొని అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయి. ఈ ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్ గురువారం వెల్లడించింది. ముంబై, ఆర్‌సీబీ, ఢిల్లీ ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. యూపీ ఒకే ఒక్క ప్లేయర్‌ను అంటిపెట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

ఫ్రాంచైజీల వారిగా ఆటగాళ్ల రిటైన్, రిలీజ్ జాబితా

ముంబై ఇండియన్స్:

రిటైన్ లిస్ట్: నాట్ సీవర్ బ్రంట్(రూ. 3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్(రూ.2.5 కోట్లు), హీలీ మాథ్యూస్(రూ.1.75 కోట్లు), అమన్ జోత్ కౌర్(రూ. కోటి), జీ కమిలిని(రూ.50 లక్షలు)

రిలీజ్ లిస్ట్: నాడిన్ డి క్లర్క్, అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా, అమేలియా కెర్, క్లో ట్రయాన్, జింటిమణి కలిత, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్.

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.5.75 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్:

రిటైన్ లిస్ట్: జెమీమా రోడ్రిగ్స్(రూ.2.2 కోట్లు), మారిజానే కాప్(రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ(రూ. 2.2 కోట్లు), అన్నబెల్ సదర్లాండ్(రూ.2.2 కోట్లు), నికీ ప్రసాద్(రూ.50 లక్షలు)

రిలీజ్ లిస్ట్: ఎన్. చరణి, నందిని కశ్యప్, సారా బ్రైస్, నికి ప్రసాద్, అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెస్ జోనాస్సెన్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు.

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.5.7 కోట్లు

ఆర్‌సీబీ:

రిటైన్ లిస్ట్: స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రిచా ఘోష్(రూ.2.75 కోట్లు), ఎల్లిస్ పెర్రీ(రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్(రూ.60 లక్షలు)

రిలీజ్ లిస్ట్: జోషిత, రాఘవి బిస్త్, జాగ్రవి పవార్, ప్రేమ రావత్, సబ్బినేని మేఘన, జార్జియో వేర్‌హమ్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.6.5 కోట్లు

యూపీవారియర్స్:

రిటైన్ లిస్ట్: శ్వేత సెహ్రావత్(రూ.50 లక్షలు)

రిలీజ్ లిస్ట్: అలానా కింగ్, అరుషి గోయెల్, క్రాంతి గౌడ్, అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.14.5 కోట్లు

గుజరాత్ జెయింట్స్:

రిటెన్షన్ లిస్ట్: అష్లే గార్డ్‌నర్(రూ.3.5 కోట్లు), బెత్ మూనీ(రూ.2.5 కోట్లు)

రిలీజ్ లిస్ట్: సిమ్రాన్ షేక్, డియాండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్, ప్రకాశిక నాయక్, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే.

మిగిలిన పర్స్ వాల్యూ: రూ.9 కోట్లు

Story first published: Thursday, November 6, 2025, 19:05 [IST]
Other articles published on Nov 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+