Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: భీకరంగా ముంబై ఇండియన్స్.. తుది జట్టు అంచనా ఇదే!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీ) 2026 టైటిలే లక్ష్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యూపీఎల్‌లోనూ ముంబై ఫ్రాంచైజీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో ముంబై రెండు సార్లు విజేతగా నిలిచింది. అరంగేట్ర డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌తో పాటు డబ్ల్యూపీఎల్ 2025 టైటిల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబై కైవసం చేసుకుంది.

ముచ్చటగా మూడో టైటిల్‌ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే జట్టును నిర్మించుకుంది. డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ చాలా సమతూకంగా కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో(జనవరి 9) ఈ లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాలు, బలహీనతలు, కీలక ఆటగాళ్లు, తుది జట్టు కాంబినేషన్‌పై ఓ లుక్కెద్దాం.

WPL 2026 Mumbai Indians Women Strengths Weaknesses and Likely Playing XI Combination

ముంబై బలాలు

హేలీ మాథ్యూస్, నాటాలీ సైవర్-బ్రంట్, అమేలియా కెర్ వంటి వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్లు ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం. వీరు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు.

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం, మెగా వేలం తర్వాత కూడా జట్టులోని కీలక ఆటగాళ్లంతా కొనసాగడం పెద్ద ప్లస్ పాయింట్.

షబ్నిమ్ ఇస్మాయిల్ వేగం, సైకా ఇషాక్, అమేలియా కెర్ స్పిన్ మ్యాజిక్ ముంబై బౌలింగ్‌ను మరింత పటిష్టం చేశాయి.

ముంబై బలహీనతలు

షబ్నిమ్ ఇస్మాయిల్ మినహా జట్టులో అనుభవం ఉన్న భారత సీనియర్ పేసర్లు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది.

యస్తికా భాటియా జట్టును వీడటంతో యువ వికెట్ కీపర్ జి. కమలినిపై భారం పడనుంది. అనుభవం లేని కీపింగ్ విభాగంతో ఆందోళన కలిగిస్తోంది.

కీలక ప్లేయర్లు

మిడిలార్డర్ బ్యాటర్‌గా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు వెన్నెముక. నాటాలీ సైవర్-బ్రంట్, అమేలియా కెర్, హేలీ మాథ్యూస్ రాణిస్తే ముంబైకి తిరుగుండదు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)

హేలీ మాథ్యూస్, జి. కమలిని (వికెట్ కీపర్), నాటాలీ సైవర్-బ్రంట్ , హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్, సజీవన్ సజనా, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, సంస్కృతి గుప్తా / త్రివేణి వశిష్ట.

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్, నాటాలీ సైవర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, జి. కమలిని, అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజనా, రహీలా ఫిర్దౌస్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, నల్ల రెడ్డి, సైకా ఇషాక్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్.

Story first published: Tuesday, January 6, 2026, 22:33 [IST]
Other articles published on Jan 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+