Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: ఆర్‌సీబీ X ముంబై మ్యాచ్‌తో షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. మొత్తం 22 మ్యాచ్‌ల వివరాలను శనివారం వెల్లడించింది. జనవరి 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు నవీ ముంబై, వడదోర వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

వడదోర వేదికగా 11, నవీ ముంబై వేదికగా 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం ఐదు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీ‌లో పాయింట్స్ టేబుల్‌లో 2, 3 వ స్థానంలో నిలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఎలిమినేటర్ విజేతతో ఫిబ్రవరి 5న టైటిల్ ఫైట్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు విజేతగా నిలవగా.. ఆర్‌సీబీ ఒకసారి టైటిల్ అందుకుంది.

WPL 2026 MI RCB Clash Set to Open a Blockbuster Season as BCCI Releases Full Schedule

గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 మెగావేలంలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ అత్యధిక ధర పలికిన విషయం తెలిసిందే. దీప్తిని ఆర్‌టీఎమ్ కార్డ్ సాయంతో రూ. 3.20 కోట్ల భారీ ధరకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్‌ను రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్, భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేను రూ.2.40 కోట్లకు యూపీ వారియర్స్, కివీస్ ప్లేయర్ సోఫీ ఎకిల్ స్టోన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ తీసుకున్నాయి. తెలుగు తేజం శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లకు తీసుకుంది.

77 స్థానాల కోసం జరిగిన ఈ మెగా వేలం 276 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఐదు ఫ్రాంచైజీలు మొత్తం 67 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందు కోసం రూ.40.80 కోట్లు ఖర్చు చేశాయి.

WPL 2026 MI RCB Clash Set to Open a Blockbuster Season as BCCI Releases Full Schedule
Story first published: Saturday, November 29, 2025, 12:39 [IST]
Other articles published on Nov 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+