For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2026: ఢిల్లీ చేతిలో ఓటమి.. ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్యూపీఎల్) 2026‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(33 బంతుల్లో 7 ఫోర్లతో 41) హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. తెలుగు తేజం శ్రీచరణి(3/33) మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించింది.

అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 3 వికెట్లకు 155 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించింది. లిజెల్లే లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.

WPL 2026 How Can Mumbai Indians Qualify for Playoffs after Huge loss against Delhi Capitals

ప్లేఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?

డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సరికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తోంది.

ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ప్రస్తుతం 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో మెరుగైన రన్‌‌రేట్‌తో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు మ్యాచ్‌లకు రెండు మెరుగైన రన్‌రేట్ విజయం సాధించాలి. అప్పటికీ ఇతర జట్లు అయిన యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల ఫలితాలపై ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడాల్సి ఉంటుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడినా ముంబై పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

నేరుగా ఫైనల్ చేరాలంటే..?

ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్ చేరడం అసాధ్యం. ఎందుకంటే ముంబై తమ తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్స్ వస్తాయి. ఇప్పటికే ఆర్‌సీబీ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకొని ఎలిమినేటర్‌లో విజయం సాధిస్తేనే ముంబైకి ఫైనల్ బెర్త్ దక్కుతుంది.

ముంబైకి మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్:

జనవరి 26: vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (వడోదర)

జనవరి 30: vs గుజరాత్ జెయింట్స్ (వడోదర)

Story first published: Wednesday, January 21, 2026, 15:26 [IST]
Other articles published on Jan 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+