వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43), కనిక అహుజా(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), భార్టి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్), బెత్ మూనీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నికోలా క్యారీ, అమెలియా కేర్ తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్(26 బంతుల్లో 7 ఫోర్లతో 40), నికోలా క్యారీ(23 బంతుల్లో 6 ఫోర్లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో రేణుకా సింగ్, కాశ్వీ గౌతమ్, సోఫీ డివైన్ తలో వికెట్ తీసారు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న ముంబై ఇండియన్స్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. తాజా మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన ఆర్‌సీబీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.