Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: ముగిసిన వేలం.. ఐదు జట్లు ఇవే!

దేశరాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలం ముగిసింది. గురువారం జరిగిన ఈ మెగా ఆక్షన్‌లో ఐదు ఫ్రాంచైజీలు అమ్మాయిలపై కనకవర్షం కురిపించాయి.

భారీ పర్స్‌మనీతో బరిలోకి దిగిన యూపీవారియర్స్‌ ఎక్కువమంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు అమేలియా కేర్, శిఖా పాండే, సోఫీ డివైన్ భారీ ధరను దక్కించుకోగా.. తెలుగు తేజం శ్రీచరణికి జాక్‌పాట్ ధర లభించింది. 277 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. ఫ్రాంచైజీలు 67 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.40.80 కోట్లు ఖర్చు చేశాయి. 11 మంది ప్లేయర్లకు కనీసం రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు దక్కాయి. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ జరగనుంది.

WPL 2026 Full List of 5 Squads after Womens Premier League Mega Auction

మెగా వేలం తర్వాత ఐదు జట్ల పూర్తి వివరాలు..

1. ముంబై ఇండియన్స్ మహిళలు

హర్మన్‌ప్రీత్ కౌర్, నాటాలీ సైవర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, జి. కమలిని, అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజనా, రహీలా ఫిర్దౌస్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, నల్ల రెడ్డి, సైకా ఇషాక్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్.

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు

స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, నడిన్ డి క్లెర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, గ్రేస్ హారిస్, గౌతమి నాయక్, ప్రాత్యూష కుమార్, దయాలన్ హేమలత.

3. ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు

జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, అన్నబెల్ సదర్లాండ్, మారిజన్నే కాప్, నికి పిఆర్సాద్, చినెల్ హెన్రీ, ఎన్. చరణి, లారా వోల్వార్డ్ట్, స్నేహ్ రాణా, మిన్ను మణి, లిజెల్ లీ, తానియా భాటియా, నందిని శర్మ, దీయా యాదవ్, మమత మడివాళ, లూసీ హామిల్టన్.

4. గుజరాత్ జెయింట్స్

బెత్ మూనీ, ఆష్లీ గార్డ్‌నర్, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, భారతి ఫుల్‌మాలి, కష్వీ గౌతమ్, రేణుకా సింగ్, కిమ్ గార్త్, యస్తికా భాటియా, డాన్నీ వ్యాట్, తనుజా కన్వర్, అనుష్క శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, టిటాస్ సాధు, కనికా అహుజా, ఆయుషి సోని, హ్యాపీ కుమారి, శివానీ సింగ్.

5. యూపీ వారియర్జ్

శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, శిఖా పాండే, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆశ శోభన, సోఫీ ఎక్లెస్టోన్, డియాండ్రా డాటిన్, కిరణ్ నవగిరే, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, క్లో ట్రయాన్, షిప్రా గిరి, సిమ్రాన్ షేక్, తారా నోరిస్, సుమన్ మీనా, జి. త్రిష.

Story first published: Thursday, November 27, 2025, 21:43 [IST]
Other articles published on Nov 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+