WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు, బలహీనతలు.. తుది జట్టు అంచనా ఇదే!
వరుసగా మూడు సీజన్లలో తృటిలో చేజారిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) టైటిల్‌ను ఈ సారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం తర్వాత ఢిల్లీ కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత మూడు సీజన్లలో జట్టును ఫైనల్ చేర్చిన మెగ్ లానింగ్ జట్టుకు దూరం కాగా.. జెమీమా రోడ్రిగ్స్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి.
శుక్రవారం ఈ మెగా లీగ్‌కు తెరలేవనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను శనివారం ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ లీగ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు, బలహీనతలు, కీలక ఆటగాళ్లు, తుది జట్టు కాంబినేషన్‌పై ఓ లుక్కెద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు..
- షెఫాలీ వర్మ, లారా వోల్వార్ట్, కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది.
- స్నేహ్ రాణా, తెలుగు తేజం శ్రీచరణి, మిన్ను మణి, అలనా కింగ్‌లతో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
- మారిజన్ కాప్, షినెల్ హెన్రీ ఆల్‌రౌండర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ బలహీనతలు
- జట్టులో శిఖా పాండే వంటి మరో సీనియర్ దేశీయ పేసర్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. కేవలం విదేశీ పేసర్లపైనే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
- వ్యక్తిగత కారణాలతో అన్నబెల్ సదర్లాండ్ ఈ సీజన్‌కు దూరంగా ఉంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కు నష్టం చేయనుంది. డెత్ ఓవర్లలో ఆమె సేవలను జట్టు కోల్పోనుంది.
- వికెట్ కీపర్ ఎంపిక కూడా క్లిష్టంగా మారనుంది. లిజెల్ లీని ఆడిస్తే విదేశీ కోటాకు ఇబ్బంది అవుతుంది. తానియా భాటియాను తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గే ఛాన్స్ ఉంది.
కీలక ఆటగాళ్లు
జెమీమా రోడ్రిగ్స్ , షెఫాలీ వర్మ, మారిజన్ కాప్, శ్రీ చరణి జట్టుకు కీలకం కానున్నారు. ఈ నలుగురు సత్తా చాటితే ఢిల్లీకి తిరుగుండదు.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా)
షెఫాలీ వర్మ, లారా వోల్వార్ట్, జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజన్ కాప్ (ఓవర్సీస్), షినెల్ హెన్రీ, నిక్కీ ప్రసాద్, తానియా భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, శ్రీచరణి, మిన్ను మణి, అలనా కింగ్ (ఓవర్సీస్) / నందని శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, అన్నబెల్ సదర్లాండ్, మారిజన్నే కాప్, నికి పిఆర్సాద్, చినెల్ హెన్రీ, ఎన్. చరణి, లారా వోల్వార్డ్ట్, స్నేహ్ రాణా, మిన్ను మణి, లిజెల్ లీ, తానియా భాటియా, నందిని శర్మ, దీయా యాదవ్, మమత మడివాళ, లూసీ హామిల్టన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications