Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: స్మృతి మంధాన విధ్వంసం.. ఢిల్లీ‌పై ఆర్‌సీబీ ఘన విజయం

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి సంచలన విజయాన్నందుకున్న ఆర్‌సీబీ.. రెండో మ్యాచ్‌లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో రేణుక సింగ్(3/23), జార్జియ వేర్హమ్(3/25) మూడేసి వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, ఎక్త్ బిష్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

WPL 2025 Smriti Mandhana 81 helps RCB beat DC by 8 wickets

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. మరో ఓపెనర్ డానీ వ్యాట్-హోడ్జ్(33 బంతుల్లో 7 ఫోర్లతో 42) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. విజయం ముంగిట ఓపెనర్లు ఔటవ్వగా..ఎల్లిస్ పెర్రీ( 7 నాటౌట్), రిచా ఘోష్( 11 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. రిచా ఘోష్ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం.

Story first published: Monday, February 17, 2025, 22:53 [IST]
Other articles published on Feb 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+