Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: షెఫాలీ వర్మ, జోనాసెన్ విధ్వంసం.. గుజరాత్‌పై ఢిల్లీ ఘన విజయం!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో పాటు షెఫాలీ వర్మ, జెస్ జోనాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. భార్తీ ఫుల్మాలి(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. డియాండ్ర డాటిన్(24 బంతుల్లో 5 ఫోర్లతో 26) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మరిజన్నే కాప్, అన్నబెల్ సదర్లాండ్ రెండేసి వికెట్లు తీయగా.. టిటస్ సదు, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ పడగొట్టారు.

WPL 2025 Shafali Verma and Jess Jonassen helps Delhi Capitals beat Gujarat Giants

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. జెస్ జోనాస్సెన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. షెఫాలీ వర్మ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44)దూకుడుగా ఆడింది. గుజరాత్ బౌలర్లలో కేశ్వీ గౌతమ్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డ్‌నర్, తనూజ కన్వార్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు మూడు విజయాలు సాధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ప్రకారం ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌ల చొప్పున మొత్తం 8 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. టాప్‌లో నిలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.

Story first published: Tuesday, February 25, 2025, 22:48 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+