వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రిచా ఘోష్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీ సంచలన విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అష్లే గార్డ్‌నర్(37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 నాటౌట్), బెత్ మూనీ(42 బంతుల్లో 8 ఫోర్లతో 56) కూడా హాఫ్ సెంచరీలతో రాణించగా.. డియోండ్ర డాటిన్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) మెరుపులు మెరిపించింది. ఆర్‌సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీయగా.. కనిక అహుజ, జార్జియ వేర్‌హమ్, ప్రేమ రావత్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ స్మృతి మంధాన(9), డానీ వ్యాట్(4) విఫలమైనా.. ఎల్లిస్ పెర్రీ(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), రిచా ఘోష్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. రిచా ఘోష్‌కు అండగా కనికా అహుజా(13 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో అష్లే గార్డ్‌నర్ రెండు వికెట్లు తీయగా.. డియాండ్ర డాటిన్, సయలి తలో వికెట్ తీసారు.
లక్ష్యచేధనలో 109 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన ఆర్‌సీబీని రిచా ఘోష్, కనిక అహుజా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి సంచలన విజయాన్నందించారు.
Intergalactic hit! 🚀#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2025 #GGvRCB
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 14, 2025
pic.twitter.com/b6IxX0UcQq