వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్ మినీ వేలానికి ముందు 5 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో పాటు మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమకు అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయి. ఈ ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా గురువారం వెల్లడించింది.
అప్‌కమింగ్ సీజన్ కోసం ప్రతీ జట్టు పర్స్ వాల్యూ రూ. 13.25 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. అయితే డబ్ల్యూపీఎల్ మినీ వేలం తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే డబ్ల్యూపీఎల్ వేలం జరిగే అవకాశం ఉంది. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత గుజరాత్ జెయింట్స్ వద్ద (రూ. 4.40 కోట్లు) అత్యధిక పర్స్ మనీ ఉంది. ఆ తర్వాత యూపీ వారియర్స్(రూ. 3.90 కోట్లు), ఆర్‌సీబీ(రూ. 3.25 కోట్లు), ముంబై ఇండియన్స్(రూ. 2.65 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 2.50 కోట్లు) వద్ద పర్స్ మనీ మిగిలి ఉంది.

1. ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్:
స్మృతి మంధాన(కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయంక పాటిల్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినక్స్, ఎక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా
ఆర్‌సీబీ రిలీజ్ లిస్ట్: దిషా కసత్, ఇంద్రాని రాయ్, నదినే డి క్లెర్క్, శుభా సతీష్, శ్రద్దా పోకార్కర్, సిమ్రాన్ బహదుర్
2. ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్:
అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్.
ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్ట్:
ఇస్సీ వాంగ్, ఫాతిమా జాఫర్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా
3.ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్:
అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్.
ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ లిస్ట్..
లారా హారిస్, పూనమ్ యాదవ్, అపర్ణ మోండల్, అశ్వని కుమారి
4.యూపీ వారియర్స్ రిటెన్షన్ లిస్ట్
అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా
యూపీ వారియర్స్ రిలీజ్ లిస్ట్
లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవి చోప్రా, సొప్పదండి యశస్రీ
5. గుజరాత్ జెయింట్స్ రిటెన్షన్ లిస్ట్
ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే
గుజరాత్ జెయింట్స్ రిలీజ్ లిస్ట్
స్నేహ రానా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నమ్ పఠాన్,లీ తహూ