WPL 2025: చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ బ్యాటర్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మహిళా బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) చరిత్రలోనే 800 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్నీ ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది. ఈ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మెగ్ లాన్నింగ్ రికార్డ్‌ను అధిగమించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు జాబితాలో ఎల్లిస్ పెర్రీస్ తర్వాత మెగ్ లాన్నింగ్ కొనసాగుతోంది. 22 మ్యాచ్‌ల్లో ఆమె 39.10 సగటు..128.40 స్ట్రైక్‌రేట్‌తో 782 పరుగులు చేసింది. ఇందులో 7 హాఫ్ సెంచరీలతో పాటు 116 బౌండరీలు, 10 సిక్స్‌లు ఉన్నాయి.

ఎల్లిస్ పెర్రీ 21 మ్యాచ్‌ల్లోనే 130 స్ట్రైక్‌రేట్, 60 యావరేజ్‌తో 800 పరుగుల మార్క్ అందుకుంది. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడి 38.66 సగటు, 131.97 స్ట్రైక్‌రేట్‌తో 8004 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో 8 శతకాలతో పాటు 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో 705 బౌండరీలతో పాటు 272 సిక్స్‌లు ఉన్నాయి.
ఎల్లిస్ పెర్రీతో పాటు డానీ వ్యాట్-హోడ్జే(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన(6), రిచా ఘోష్(8), కనిక అహుజ(5), జార్జియ వేర్‌హామ్(7) దారుణంగా విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో హెన్రీ, దీప్తి శర్మ, తహిల మెక్‌గ్రాత్ తలో వికెట్ తీసారు.
🚨 ELLYSE PERRY - FIRST EVER TO SCORE 800 RUNS IN WPL HISTORY. 🚨 pic.twitter.com/t9Mvp9ja46
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications