For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2025: నాట్ సీవర్ నాటు బ్యాటింగ్.. గుజరాత్‌పై ముంబై ఘన విజయం

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2025 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హర్లీన్ డియోల్(31 బంతుల్లో 4 ఫోర్లతో 32), కేశ్వీ గౌతమ్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్(3/16) మూడు వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్(2/26), అమెలియా కేర్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.

WPL 2025 Nat Sciver-Brunt Fifty Drives Mumbai Indians Beat Gujarat Giants

అనంతరం ముంబై ఇండియన్స్ 16.1 ఓవర్లలోనే 5 వికెట్లకు 122 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నాట్ సివర్ బ్రంట్(39 బంతుల్లో 11 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అమెలియా కేర్(19) మెరుపులు మెరిపించింది. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా, కేశ్వీ గౌతమ్ రెండేసి వికెట్లు తీయగా.. తనూజ కన్వార్ ఓ వికెట్ పడగొట్టింది.

Story first published: Tuesday, February 18, 2025, 23:02 [IST]
Other articles published on Feb 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+