For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2025: ముగిసిన వేలం.. ఐదు జట్లు ఇవే!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 మెగా వేలం ముగిసింది. ఐదు ఫ్రాంచైజీల్లోని 19 స్థానాల కోసం బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఈ మినీ వేలంలో 120 మంది పోటీపడ్డారు. ఈ వేలంలో భారత అనామక ప్లేయర్లు సిమ్రాన్ బేస్‌, 16 ఏళ్ల జి కమలిని రికార్డ్ ధర పలికారు. మహారాష్ట్రకు చెందిన మిడిలార్డర్ బ్యాటర్ సిమ్రాన్ బేస్‌ను రూ. 1.90 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేయగా.. తమిళనాడు వికెట్ కీపర్ జి కమలిని ముంబై ఇండియన్స్ రూ. 1.60 కోట్లకు దక్కించుకుంది.

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను రూ. 1.75 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకోగా.. భారత స్టార్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అన్‌సోల్డ్‌గా నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమెను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్‌ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ. 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసేందుకు కూడా జట్లు ఆసక్తి చూపలేదు.

WPL 2025 Full List Of 5 Squads After Women s Premier League Auction
Photo Credit: X

వేలం తర్వాత పూర్తి జట్లు ఇవే:

1. ఆర్‌సీబీ

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జోషిత(రూ. 10 లక్షలు,) రాఘవి బిస్త్(రూ. 10 లక్షలు), జాగ్రవి పవార్(రూ. 10 లక్షలు), ప్రేమ రావత్(రూ. 1.20 కోట్లు)

రిటెన్షన్ లిస్ట్:
స్మృతి మంధాన(కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయంక పాటిల్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా

2. ముంబై ఇండియన్స్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జి కమలిని(రూ. 1.60 కోట్లు), నాడిన్ డి క్లర్క్(రూ. 30 లక్షలు), అక్షితా మహేశ్వరి(రూ. 20 లక్షలు), సంస్కృతి గుప్తా(రూ. 10 లక్షలు)

రిటెన్షన్ లిస్ట్:
అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్.

3. ఢిల్లీ క్యాపిటల్స్
వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్: ఎన్. చరణి(రూ. 55 లక్షలు), నందిని కశ్యప్(రూ. 10 లక్షలు), సారా బ్రైస్(రూ. 10 లక్షలు), నికి ప్రసాద్(రూ.10 లక్షలు)

రిటెన్షన్ లిస్ట్:
అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్.

4.యూపీ వారియర్స్

వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్: అలానా కింగ్(రూ. 30 లక్షలు), అరుషి గోయెల్(రూ. 10 లక్షలు), క్రాంతి గౌడ్(రూ. 10 లక్షలు)

రిటెన్షన్ లిస్ట్
అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా

5. గుజరాత్ జెయింట్స్

వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్: సిమ్రాన్ షేక్(రూ. 1.90 కోట్లు), డియాండ్రా డాటిన్(రూ. 1.70 కోట్లు), డేనియల్ గిబ్సన్(రూ. 30 లక్షలు), ప్రకాశిక నాయక్(రూ. 10 లక్షలు)

రిటెన్షన్ లిస్ట్
ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే.

Story first published: Sunday, December 15, 2024, 19:47 [IST]
Other articles published on Dec 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+