Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025 ఫైనల్.. ముంబై ఇండియన్స్‌దే బ్యాటింగ్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు ముందుగా బౌలింగ్ చేయడం ఈ సీజన్‌లో తమకు కలిసొచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ తెలిపింది. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పరిస్థితులు ఒకేలా ఉంటాయి. ముందుగా బౌలింగ్ చేయడం ఈ టోర్నీలో మాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు మాకు కావాల్సిన విశ్రాంతి లభించింది. టైటిల్ గెలిచేందుకు ఇది మాకు మంచి అవకాశం. బాగా ఆడాల్సిన అవసరం ఉంది. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం.'అని మెగ్ లాన్నింగ్ తెలిపింది.

WPL 2025 Final Meg Lanning s Delhi opt to bowl against Mumbai

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అయితే ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పింది.'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఏదైనా మాకు మంచిదే. గత నాలుగు మ్యాచ్‌ల గణంకాలు చూస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. సమతూకంగా ఉండటంతో పాటు పరిస్థితులకు తగ్గట్లు ఆడటం మాకు కలిసొచ్చింది. ఈ టోర్నీలో ఢిల్లీ అద్భుతంగా ఆడింది. గత వారం మాకు అద్భుతంగా గడిచింది. తొలి సీజన్‌లో మాకు మధురమైన జ్ఞాపకాలు లభించాయి. ఇది మాకు మరో కొత్త రోజు. మేం మా ఆటను ఆస్వాదిస్తాం. తుది జట్టులో మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్ : యాస్తికా భాటియా(కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి.

Story first published: Saturday, March 15, 2025, 20:06 [IST]
Other articles published on Mar 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+