Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025 వేలంలో కడప బిడ్డకు జాక్‌పాట్..!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మెగా వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ శ్రీ చరణిని రూ. 55 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 10 లక్షల బేసిక్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన శ్రీ చరణి కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

దాంతో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డ్ ధరకు సొంతం చేసుకుంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీ చరణికి మాత్రమే అవకాశం దక్కింది.

WPL 2025 Auction Who is N Charani Telugu Players joins DC for Rs 55 lakh

ఎవరీ శ్రీ చరణి?
వైఎస్సార్ కడప జిల్లాలోని వీరపునాయుని మండలం ఎర్రమల్లపల్లె గ్రామానికి చెందిన శ్రీ చరణి.. బాల్యం నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. మేనమామ ప్రోత్సాహంతో ఆమె క్రికెట్, ఖోఖో, లాంగ్ జంప్‌ క్రీడలు ఆడటం ప్రారంభించింది. కానీ ఇంటర్ వరకు ఆమె క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోలేదు.

చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్‌పై ఫోకస్ పెట్టిన శ్రీ చరణి.. టెన్త్ తర్వాత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 2016-17 సమయంలో హైదరాబాద్‌లోని సాయ్ అకాడమీకి కూడా ఎంపికైంది.

అథ్లెటిక్స్ నుంచి క్రికెట్‌వైపు..
టెన్త్ క్లాస్‌లో అథ్లెటిక్స్ విభాగంలో నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయికి చేరినా.. క్రికెట్ అంటేనే ఎక్కువగా ఇష్టం ఉండటంతో అటు వైపు మళ్లింది. ఆరంభంలో ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ చరణి పట్టుదల చూసి ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ అకాడమీలో శిక్షణ తీసుకుంది.

జిల్లా, రాష్ట్రా స్థాయిలో రాణించి.. సెలెక్టర్ల దృష్టిలో పడింది. అండర్ 19 మహిళల ఛాలెంజర్స్ టోర్నీలో ఇండియా సి తరఫున మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన చరణి.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగలదు. ఆమె ఆల్‌రౌండ్ సామర్థ్యానికి ఫిదా అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో కోట్లు కుమ్మరించింది.

ఢిల్లీ క్యాపిటల్స్
వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్: ఎన్. చరణి(రూ. 55 లక్షలు), నందిని కశ్యప్(రూ. 10 లక్షలు), సారా బ్రైస్(రూ. 10 లక్షలు), నికి ప్రసాద్(రూ.10 లక్షలు)

రిటెన్షన్ లిస్ట్:
అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్.

Story first published: Monday, December 16, 2024, 17:50 [IST]
Other articles published on Dec 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+