మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్ మినీ వేలంలో భారత అనామక ప్లేయర్ సిమ్రాన్ బేస్‌కు జాక్‌పాట్ దక్కింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఈ మినీ వేలంలో మిడిలార్డర్ బ్యాటర్ సిమ్రాన్ బేస్‌ను రూ. 1.90 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
రూ. 10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సిమ్రాన్ బేస్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. దాంతో ఆమె పంట పండింది. భారత్‌కే చెందిన 16 ఏళ్ల జి కమలినికి రికార్డ్ ధర దక్కింది. రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ తమిళనాడు వికెట్ కీపర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 1.60 కోట్లకు దక్కించుకుంది.

కమలిని కోసం ఢిల్లీ తీవ్రంగా పోటీపడటంతో ఆమె ధర అమాంతం పెరిగింది. అక్టోబర్‌లో జరిగిన అండర్ 19 మహిళల టీ20 ట్రోఫీలో కమలిని అద్భుత ప్రదర్శన కనబర్చింది. 8 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసి సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచింది. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సత్తా చాటింది.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను రూ. 1.75 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన డాటిన్ కోసం గుజరాత్, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ భారీ ధరకు దక్కించుకుంది.
భారత స్టార్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అన్‌సోల్డ్‌గా నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమెను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్‌ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ. 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసేందుకు కూడా జట్లు ఆసక్తి చూపలేదు.
వేలంలో అమ్ముడైన ప్లేయర్లు:
సిమ్రాన్ షేక్-రూ. 1.90 కోట్లు(గుజరాత్ జెయింట్స్)
డియాండ్రా డాటిన్- రూ.1.70 కోట్లు(గుజరాత్ జెయింట్స్)
జి కమలిని-రూ. 1.60 కోట్లు(ముంబై ఇండియన్స్)
ప్రేమ రావత్-రూ. 1.20 కోట్లు(ఆర్‌సీబీ)
ఎన్. చరణి-రూ. 55 లక్షలు(ఢిల్లీ క్యాపిటల్స్)
నాడిన్ డి క్లర్క్- రూ. 30 లక్షలు(ముంబై ఇండియన్స్)
నందిని కశ్యప్-రూ. 10 లక్షలు(ఢిల్లీ క్యాపిటల్స్)
అరుషి గోయెల్-రూ. 10 లక్షలు(యూపీ వారియర్స్)
క్రాంతి గౌడ్-రూ. 10 లక్షలు(యూపీ వారియర్స్)
జోషిత-రూ. 10 లక్షలు(ఆర్‌సీబీ)
సంస్కృతి గుప్తా-రూ. 10 లక్షలు(ముంబై ఇండియన్స్)
సారా బ్రైస్-రూ. 10 లక్షలు(ఢిల్లీ క్యాపిటల్స్)