Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: ప్చ్..ఓటముల్లో ఆర్‌సీబీ హ్యాట్రిక్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓడి హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసింది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్ ఆర్‌సీబీ ఓటమిని శాసించాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. కనిక అహుషా(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాఘ్వి బిస్త్(22), జార్జియో వేర్‌హమ్(21) పర్వాలేదనిపించారు. కెప్టెన్ స్మృతి మంధాన(10), డాని వ్యాట్(4), ఎల్లిస్ పెర్రీ(0), రిచా ఘోష్(9) తీవ్రంగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో డియోండ్ర డాటిన్, తనుజ కన్వార్ రెండేసి వికెట్లు తీయగా.. అష్లీ గార్డ్‌నర్, కేశ్వీ గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.

WPL 2025 Ashleigh Gardner 58 runs helps Gujarat Giants beat RCB

అనంతరం గుజరాత్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ అష్లే గార్డ్‌నర్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫోబే లిట్చ్‌ఫీల్డ్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో రేణుక సింగ్(2/24), జార్జియా వేర్‌హమ్(2/26) రెండేసి వికెట్లు తీసారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ టాప్‌లో కొనసాగుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది.

Story first published: Thursday, February 27, 2025, 22:52 [IST]
Other articles published on Feb 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+