Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024: ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన యూపీ వారియర్స్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు యూపీ వారియర్స్ షాకిచ్చింది. బెంగళూరు వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరంగా ఉండగా.. నాట్ సీవర్ బ్రంట్ సారథ్యంలో బరిలోకి దిగిన ఆ జట్టు ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులే చేసింది. హీలీ మాథ్యూస్(47 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

UP beat Mi

యస్తికా భాటియా(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) పర్వాలేదనిపించింది. యూపీ బౌలర్లలో తెలుగు తేజం అంజలి శార్వాణి, గ్రేస్ హరీస్, సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలుపొందింది. కిరణ్ నావ్‌గిరే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. అలీసా హీలీ(29 బంతుల్లో 5 ఫోర్లతో 33) , గ్రేస్ హారీస్(17 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో అమెలియా కేర్ ఓ వికెట్ తీయగా.. ఇస్సీ వాంగ్ రెండు వికెట్లు పడగొట్టింది.

ఈ సీజన్‌లో యూపీ వారియర్స్‌కు ఇదే తొలి విజయం కాగా ముంబై ఇండియన్స్‌కు తొలి పరాజయం. గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించింది.

Story first published: Wednesday, February 28, 2024, 22:48 [IST]
Other articles published on Feb 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+