For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఆర్‌సీబీ విన్నర్‌కు టాటా కంపెనీ అరుదైన బహుమతి!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ఆల్‌రౌండర్, ఎలిమినేటర్ మ్యాచ్ విన్నర్ ఎల్లిస్ పెర్రీకి టాటా సంస్థ అరుదైన బహుమతిని అందజేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్లతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ(50 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 66) సంచలన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఎల్లిస్ పెర్రీకి టాటా సంస్థ వినూత్న బహుమతిని అందజేసింది.

WPL 2024 RCB s Ellyse Perry presented with broken car glass from TATA

అరుదైన గిఫ్ట్
ఈ లీగ్‌లో ఆమె కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు టాటా సంస్థకు చెందిన కారు అద్దాలు పగిలాయి. టైటిల్ స్పాన్సర్ అయిన టాటా.. ప్రమోషన్స్‌లో భాగంగా టాటా పంచ్ కారును ప్రతీ మ్యాచ్‌కు మైదానంలో ప్రదర్శనకు ఉంచుతోంది. అయితే ఓ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ కొట్టిన భారీ సిక్సర్‌కు టాటా పంచ్ కారు ఫ్రంట్ డోర్ గ్లాస్ పగిలిపోయింది. అప్పట్లో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ పగిలిపోయిన గ్లాస్‌ను ఫ్రేమ్ కట్టించిన టాటా కంపెనీ.. ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం ప్రత్యేక బహుమతిగా అందజేసింది. నాణ్యత, సేఫ్టీలో టాప్ ర్యాంక్ కలిగిన టాటా కార్ గ్లాస్‌ను సిక్సర్‌తో పగలగొట్టిన ఎల్లిస్ పెర్రీపై అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది.

ఏ మ్యాచ్‌లో అంటే...
యూపీ వారియర్స్‌తో మార్చి 4న జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ కొట్టిన భారీ సిక్సర్.. నేరుగా టాటా పంచ్ కారు విండోను బలంగా తాకింది. దాంతో కారు అద్దాలు పగిలిపోయాయి. యూపీ వారియర్స్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లిస్ పెర్రీ ధాటికి 80 మీటర్ల దూరంలో పడిన బంతి కారు విండోను బద్దలు చేసింది.

WPL 2024 RCB s Ellyse Perry presented with broken car glass from TATA

ఉత్కంఠ పోరులో ముంబై ఓటమి..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(50 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులే చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 4 ఫోర్లతో 33) పోరాడినా ఫలితం దక్కలేదు.

శ్రేయాంక పాటిల్(2/16) రెండు వికెట్లు తీయగా.. ఎలీస్ పెర్రీ, ఆశ(1/13), మోలనూ తలో వికెట్ తీసారు. శ్రేయాంక పాటిల్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి హర్మన్‌ప్రీత్ కౌర్ స్టంపౌట్‌గా వెనుదిరిగింది. ఆమె చేసిన తప్పిదం ముంబై పతనాన్ని శాసించింది.

Story first published: Saturday, March 16, 2024, 16:25 [IST]
Other articles published on Mar 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+