Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024: ఆర్‌సీబీ బ్యాటర్ భారీ సిక్సర్.. పగిలిపోయిన కార్ గ్లాస్! (వీడియో)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024లో భాగంగా యూపీ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58)హాఫ్ సెంచరీతో రాణించింది. ఈ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు కారు అద్దం పగిలింది.

ప్రమోషన్‌లో భాగంగా టైటిల్ స్పాన్సర్ టాటా కంపెనీకి చెందిన పంచ్ కారును మైదానంలో ప్రదర్శనకు పెట్టారు. ఎల్లిస్ పెర్రీ కొట్టిన భారీ సిక్సర్.. నేరుగా టాటా పంచ్ కారు విండోను బలంగా తాకింది. దాంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

WPL 2024 RCB batter Ellyse Perry s huge six shatters car window

టాటా పంచ్ కారు అద్దమే పగిలిందంటే.. ఎల్లిస్ పెర్రీ ఎంత పవర్‌ఫుల్ షాట్ ఆడిందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లిస్ పెర్రీ ధాటికి 80 మీటర్ల దూరంలో పడిన బంతి కారు విండోను బద్దలు చేసింది.

ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), ఎల్లిస్ పెర్రీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58)హాఫ్ సెంచరీలతో రాణించారు. యూపీ బౌలర్లలో అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లేస్టోన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ అలీస్సా హీలీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. దీప్తి శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33), పూనమ్ ఖేమ్నర్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ చేధించాల్సి లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ఒత్తిడికి గురై వికెట్ పారేసుకున్నారు.

ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ డివైన్, సోఫీ మోలినక్స్, జార్జియో వేర్‌హమ్, అషా సోభాన తలో రెండు వికెట్లు తీసారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానం చేరగా.. యూపీ వారియర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Story first published: Monday, March 4, 2024, 22:49 [IST]
Other articles published on Mar 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+