వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో మేఘన సింగ్(4/37) నాలుగు వికెట్లు తీయగా.. అశ్లే గార్డ్‌నర్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మన్నత్ కశ్యప్, తనూజ కన్వర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్నీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులే చేసి ఓటమిపాలైంది. అశ్లే గార్డ్‌నర్(40) ఒక్కతే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమైంది.జెస్స్ జోనాస్సెన్(3/22), రాధా యాదవ్(3/20) మూడేసి వికెట్లు తీయగా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీసారు.