For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2024: చెలరేగిన షెఫాలీ వర్మ.. యూపీ వారయర్స్‌పై ఢిల్లీ ఘన విజయం!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు శుభారంభం చేసింది. యూపీ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో రాధా యాదవ్(4/20), మరిజన్నే కాప్(3/5) నిప్పులు చెరగగా.. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ(43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్), మెగ్ లాన్నింగ్(43 బంతుల్లో 6 ఫోర్లతో 51) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులే చేసింది. శ్వేత సెహ్రావత్(42 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ అలిసా హీలీ(13), తహిళా మెక్‌గ్రాత్(17), దీప్తి శర్మ(5) తీవ్రంగా నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్ 4 వికెట్లు తీయగా.. మరిజన్నే కేప్ మూడు, అరుంధతి రెడ్డి, అన్నబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీసారు.

WPL 2024: Meg Lanning, Shafali Verma power Capitals to their first win in WPL season 2

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 14.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 123 పరుగులు చేసి గెలుపొందింది. జెమీమా రోడ్రిగ్స్(4 నాటౌట్) బౌండరీతో విజయలాంఛాన్ని పూర్తి చేసింది. సోఫీ ఎక్లేస్టోన్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది తొలి విజయం కాగా.. యూపీ వారియర్స్‌కు వరుసగా రెండో పరాజయం.

Story first published: Monday, February 26, 2024, 22:35 [IST]
Other articles published on Feb 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+