Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024: వారెవ్వా వాటే ఫీల్డింగ్.. సిక్సర్‌ కాస్తా టూడీగా..! (వీడియో)

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ జార్జియా వేర్‌హామ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర సూపర్ వుమెన్‌లా గాల్లోకి ఎగిరి సిక్సర్‌ను అడ్డుకుంది. వేర్‌హోమ్ ఫీల్డింగ్ ఎఫర్ట్.. ఆర్‌సీబీ దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఫీల్డింగ్ విన్యాసాన్ని గుర్తుకు తెచ్చింది.

ఆమె సూపర్ ఫీల్డింగ్‌ను చూసి ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ షెఫాలీ వర్మ బిత్తరపోయింది. నడిన్ డి క్లర్క్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని షెఫాలీ వర్మ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్‌కు ప్రయత్నించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వేర్‌హామ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఎడమ చేతితో బంతిని లోపలికి నెట్టేసింది.

WPL 2024: Georgia Warehams Sensational Effort Near Boundary To Save a Six During RCB-W vs DC-W

దాంతో సిక్సర్ కాస్త టూడీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ సూపర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వేర్‌హామ్ ఫీల్డింగ్ విన్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారెవ్వా వాటే ఫీల్డింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అలిస్ క్యాప్సీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో మరిజన్నే కాప్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32), జెస్ జొనాస్సెన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్)మెరుపులు మెరిపించారు.

ఆర్‌సీబీ బౌలర్లలో నడిన్ డి క్లర్క్, సోఫీ డివైన్ రెండేసి వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ ఓ వికెట్ పడగొట్టింది. ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ దూరంగా ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌కు దూరమైందని టాస్ సందర్భంగా కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది.

Story first published: Thursday, February 29, 2024, 21:42 [IST]
Other articles published on Feb 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+