Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024: గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్‌ చేరింది. గుజరాత్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. భార్తీ ఫుల్మాలి(36 బంతుల్లో 7 ఫోర్లతో 42), కాథ్రిన్ బ్రైస్(22 బంతుల్లో 4 ఫోర్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

WPL 2024 Delhi Capitals secure WPL finals spot with dominating win against Gujarat Giants

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరజన్నే కాప్, శిఖా పాండే, మిన్ను మణి రెండేసి వికెట్లు తీయగా.. జెస్ జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వార్(2/20) రెండు వికెట్లు తీసారు.

WPL 2024 Delhi Capitals secure WPL finals spot with dominating win against Gujarat Giants

ఈ టోర్నీ నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

Story first published: Wednesday, March 13, 2024, 22:53 [IST]
Other articles published on Mar 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+